Loading...
Google Gemini 3.6: గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు
గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు

Google Gemini 3.6: గూగుల్ నుంచి జెమినీ 3.6 ఫ్లాష్ విడుదల.. ఏఐలో మరో కీలక అడుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో గూగుల్ డీప్‌మైండ్ తన జెమినీ సిరీస్‌లో మూడు కొత్త మోడళ్లను విడుదల చేసింది. వీటిలో జెమినీ 3.6 ఫ్లాష్, జెమినీ 3.5 ఫ్లాష్-లైట్, జెమినీ 3.5 ఫ్లాష్ సైబర్ ఉన్నాయి. ఇందులో జెమినీ 3.6 ఫ్లాష్‌ను సంస్థ తన ప్రధాన వర్క్‌హోర్స్ మోడల్‌గా అభివర్ణించింది. కోడింగ్, నాలెడ్జ్ వర్క్, మల్టీమోడల్ టాస్క్‌లలో ఇది మరింత మెరుగైన పనితీరును అందిస్తుందని, టోకెన్ వినియోగాన్ని గరిష్ఠంగా 17 శాతం వరకు తగ్గించడం వల్ల గత జెమినీ 3.5 ఫ్లాష్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని గూగుల్ తెలిపింది.

వివరాలు 

ప్రభుత్వాలకు అందుబాటులోకి రానున్న 'ఫ్లాష్ సైబర్' మోడల్

ఈ సిరీస్‌లో జెమినీ 3.5 ఫ్లాష్-లైట్ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉండే మోడల్‌గా రూపొందించగా, జెమినీ 3.5 ఫ్లాష్ సైబర్ను ప్రత్యేకంగా సైబర్ భద్రత అవసరాల కోసం అభివృద్ధి చేసింది.

కంప్యూటర్ వ్యవస్థల్లో ఉండే భద్రతా లోపాలను గుర్తించి వాటిని సరిచేయడంలో ఈ మోడల్ ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.

అయితే ఈ మోడల్ సాధారణ వినియోగదారులకు అందుబాటులో ఉండదు.

పరిమిత యాక్సెస్ పైలట్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభుత్వాలు, విశ్వసనీయ భాగస్వాములకు మాత్రమే దీనిని అందించనున్నట్లు గూగుల్ వెల్లడించింది.

వివరాలు 

ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్ సంస్థలతో గూగుల్ పోటీ

పెద్ద స్థాయిలో ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేస్తున్న వినియోగదారులకు వేగం, విశ్వసనీయత, తక్కువ ఆలస్యం (లేటెన్సీ), మెరుగైన సామర్థ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త మోడళ్లను విడుదల చేసినట్లు గూగుల్ తెలిపింది.

అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జెమినీ ప్రో మోడల్‌కు సంబంధించిన కొత్త అప్‌డేట్ మాత్రం ఈ విడుదలలో లేకపోవడం గమనార్హం.

ఈ మోడల్‌కు చివరిసారిగా ఫిబ్రవరిలో అప్‌డేట్ ఇవ్వగా, ప్రస్తుతం ఓపెన్‌ఏఐ,ఆంథ్రోపిక్ వంటి సంస్థలు వరుసగా కొత్త ఏఐ మోడళ్లను విడుదల చేస్తుండటంతో ఏఐ రంగంలో పోటీ మరింత తీవ్రమవుతున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT

వివరాలు 

జెమిని 3.5 ప్రో త్వరలో విడుదలయ్యే అవకాశం 

ఇదిలా ఉండగా, జెమినీ 3.5 ప్రో మోడల్ విడుదల కోడింగ్ పనితీరుకు సంబంధించిన కొన్ని సమస్యల కారణంగా వాయిదా పడినట్లు సమాచారం.

కొత్త విడుదల తేదీని గూగుల్ ఇంకా ప్రకటించలేదు.

అయినప్పటికీ, జెమినీ 3.5 ప్రోను భాగస్వాములతో కలిసి పరీక్షిస్తున్నామని, త్వరలోనే అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని గూగుల్ డీప్‌మైండ్ ప్రొడక్ట్ లీడ్ లోగన్ కిల్‌పాట్రిక్ తెలిపారు.

అలాగే తదుపరి తరం జెమినీ 4 కోసం ఇప్పటివరకు చేపట్టిన వాటిలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ప్రీ-ట్రైనింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.

ADVERTISEMENT