
Google Pixel 9A: భారత్‌లో లాంచ్ అయ్యిన గూగుల్ పిక్సెల్ 9ఏ.. ధరెంతంటే?
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తాజాగా పిక్సెల్ 9A స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.
గత సంవత్సరం ఆగస్టులో పిక్సెల్ 9 సిరీస్‌లో 9,9 ప్రో, 9 ప్రో ఎక్స్‌ఎల్,9 ప్రో ఫోల్డ్ మోడళ్లను లాంచ్ చేసిన గూగుల్,ఇప్పుడు అదే సిరీస్‌లో టెన్సర్ జీ4 ప్రాసెసర్ తో పిక్సెల్ 9A ను అందుబాటులోకి తెచ్చింది.
ఇటీవల ఆపిల్ తక్కువ ధరలో ఐఫోన్ 16ఈ విడుదల చేయగా,దానికి పోటీగా గూగుల్ ఈ మోడల్‌ను విడుదల చేయడం గమనార్హం.
అయితే,9 సిరీస్ హైఎండ్ మోడళ్లలోని కొన్ని ఫీచర్లను తీసివేసి,ఈ ఫోన్‌ను మరింత సరసమైన ధరలో అందిస్తున్నారు.
6.3 అంగుళాల ఆక్టా డిస్‌ప్లే,120Hz రిఫ్రెష్ రేట్,2700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్,కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి.
వివరాలు
ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ & సెక్యూరిటీ అప్‌డేట్స్
5,100mAh బ్యాటరీ,45W ఫాస్ట్ ఛార్జింగ్ తో 30 గంటల బ్యాకప్ అందిస్తుంది.
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం 48MP మెయిన్ కెమెరా (OIS, EIS సపోర్ట్‌తో),13MP అల్ట్రావైడ్ కెమెరా,13MP సెల్ఫీ కెమెరా అందించగా,మ్యాజిక్ ఎడిటర్,మ్యాజిక్ ఎరేజర్,ఫొటో అన్‌బ్లర్ వంటి ఏఐ ఫీచర్లు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
గూగుల్ ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ & సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనుందని తెలిపింది.
ఇది 8GB+128GB, 8GB+256GB వేరియంట్లలో లభించనుంది.
ప్రారంభ ధర ₹49,999గా నిర్ణయించగా,హైఎండ్ వేరియంట్ ధర ₹56,999గా ఉంది.
ఏప్రిల్ నెలలో ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, క్రోమా స్టోర్లలో ఇది విక్రయానికి అందుబాటులోకి రానుంది, అయితే ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు.