LOADING...
Google Play Store: ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు
ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు

Google Play Store: ప్లే స్టోర్‌లో కొత్త బిల్లింగ్ విధానం.. డెవలపర్లకు మరింత వెసులుబాటు

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 25, 2026
11:20 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన ప్లే స్టోర్ బిల్లింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, యూరప్ దేశాల్లో 2026 జూన్ 30 నుంచి యాప్ డెవలపర్లు గూగుల్ ప్లే బిల్లింగ్‌తో పాటు బాహ్య (ఎక్స్‌టర్నల్) పేమెంట్ సిస్టమ్‌లను కూడా ఉపయోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించింది. యాప్‌లలో చెల్లింపుల విషయంలో గుత్తాధిపత్యం ప్రదర్శించిందంటూ గేమింగ్ సంస్థ ఎపిక్ గేమ్స్ దాఖలు చేసిన కేసు తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పోటీ వ్యతిరేక (యాంటీట్రస్ట్) నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడంతో పాటు డెవలపర్లకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఈ మార్పులు తీసుకొస్తున్నట్లు గూగుల్ తెలిపింది.

వివరాలు 

మొదటి 10 లక్షల డాలర్ల ఆదాయంపై 10 శాతం ఫీజు

కొత్త విధానం ప్రకారం, డెవలపర్లు ఏడాదికి సంపాదించే తొలి 10 లక్షల అమెరికన్ డాలర్ల వరకు 10 శాతం సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు గూగుల్ ప్లే బిల్లింగ్ ద్వారా జరిగినా, ప్రత్యామ్నాయ ఇంటిగ్రేటెడ్ బిల్లింగ్ సిస్టమ్ ద్వారా జరిగినా లేదా యాప్ వెలుపల బాహ్య లింకుల ద్వారా జరిగినా ఈ రుసుము ఒకేలా ఉంటుంది. గతంలో ఈ వివాదం ప్రారంభమైన సమయంలో గూగుల్ వసూలు చేసిన 30 శాతం కమిషన్‌తో పోలిస్తే ఇది గణనీయంగా తక్కువ.

వివరాలు 

వినియోగదారుల ఆధారంగా ఫీజుల్లో తేడా..

ఆటో రిన్యూవల్ సబ్‌స్క్రిప్షన్‌లను మినహాయించి ఇతర లావాదేవీలపై తొలి 10 లక్షల డాలర్ల ఆదాయం దాటిన తర్వాత గూగుల్ ఫీజులు పెరుగుతాయి. అలాగే కొత్తగా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వినియోగదారులు, ఇప్పటికే యాప్‌ను ఉపయోగిస్తున్న వినియోగదారులను వేర్వేరుగా పరిగణించి ఫీజులు నిర్ణయించనుంది. ఒకవేళ డెవలపర్లు గూగుల్ ప్లే బిల్లింగ్‌ను ఎంచుకుంటే అదనంగా 5 శాతం బిల్లింగ్ రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది.

Advertisement

వివరాలు 

గూగుల్ ప్లే బిల్లింగ్‌కు అదనపు రుసుము

గూగుల్ ప్లే బిల్లింగ్ ద్వారా జరిగే లావాదేవీలపై అమెరికా, బ్రిటన్, యూరోపియన్ ఎకనామిక్ ఏరియా (EEA) దేశాల్లో అదనంగా 5 శాతం బిల్లింగ్ ఫీజు అమల్లో ఉంటుంది. అయితే ప్రత్యామ్నాయ బిల్లింగ్ విధానం లేదా యాప్ వెలుపల ఉన్న వెబ్ లింకుల ద్వారా జరిగే చెల్లింపులకు ఈ అదనపు రుసుము వర్తించదు. అలాగే గూగుల్ నిర్వహించే 'లెవల్ అప్' లేదా 'యాప్స్ ఎక్స్‌పీరియన్స్' కార్యక్రమాలకు అర్హత సాధించిన యాప్‌లకు ప్రత్యేకంగా తగ్గింపు ఫీజులు కూడా అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది.

Advertisement