Google Doppl: ఆన్‌లైన్‌లో దుస్తులు కొనేవారికి గూగుల్ నుంచి కొత్త వర్చువల్ ట్రయల్ యాప్
ఈ వార్తాకథనం ఏంటి
రోడ్డు మీద వెళుతూ ఉంటే స్టోర్‌లో షర్ట్ కనిపిస్తుంది.. లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఆకర్షణీయమైన టీషర్ట్ కనిపిస్తుంది. అలాంటి దుస్తులు మనపై ఎలా కనిపిస్తాయో తెలుసుకోవాలంటే వాటిని ట్రయల్ వేయడమో, కొనడమో చేయాలి. ఇక అలాంటి అవసరం లేకుండా కేవలం ఒక ఫోటో తీసి అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఈ అనుభవాన్ని ఇవ్వడానికే గూగుల్ తాజాగా ఓ వినూత్న యాప్‌ను పరిచయం చేసింది. ఈ యాప్ పేరు డోప్ల్ (Doppl). వర్చువల్ మోడలింగ్‌కు ఇది సహాయపడుతుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారికి ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.
వివరాలు
డోప్ల్ యాప్ ఎలా పని చేస్తుంది?
ఈ యాప్‌ను ఉపయోగించాలంటే మొదట మీ పూర్తి బాడీ ఫోటోను అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన దుస్తుల ఫోటో లేదా స్క్రీన్‌షాట్‌ను యాప్‌లో జోడిస్తే సరిపోతుంది. గూగుల్ రూపొందించిన అధునాతన ఎಐ టెక్నాలజీ సహాయంతో, మీరు ఆ దుస్తులు వేసుకున్నట్లుగా ఒక వర్చువల్ ప్రివ్యూను చూపిస్తుంది. అంతే కాదు, మీరు ముందువైపు, వెనుకవైపు ఎలా కనిపిస్తారో చూపేలా చిన్న వీడియోను కూడా రూపొందిస్తుంది. ఇది ట్రయల్ రూమ్ అనుభవాన్ని మిమ్మల్ని విడిచి పెట్టకుండా అందిస్తుంది. ఈ ఫోటోలు, వీడియోలను మీరు సేవ్ చేసుకోవచ్చు లేదా ఇతరులతో షేర్ చేయవచ్చు.
వివరాలు
ప్రస్తుతం అమెరికాలో మాత్రమే లభ్యం
గూగుల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ యాప్ ప్రస్తుతం ట్రయల్ దశలో ఉంది. ఇది గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ సేవలు అమెరికా పౌరులకు మాత్రమే అందుబాటులో ఉంది. భారతీయ వినియోగదారులు దీనిని వినియోగించాలంటే కొద్ది రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో ఎప్పటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి వస్తుందనే దానిపై గూగుల్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
వివరాలు
ఇక పూర్తి లుక్‌ను కూడా చూపిస్తుంది
ఇంకొక విశేషం ఏంటంటే.. మీరు కేవలం ఓ షర్ట్ లేదా టీషర్ట్‌ను అప్లోడ్ చేస్తే.. దానికి తగ్గ మిగిలిన దుస్తులు, షూస్‌లను కూడా డోప్ల్ ఎఐ తనంతట తానే ఎంపిక చేసి వర్చువల్‌గా చూపిస్తుంది. దీని ద్వారా మీరు పూర్తిగా ఆ దుస్తులు వేసుకున్నట్టు ఉన్న లుక్‌ను ముందుగానే చూడగలుగుతారు.