Google Weather: ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్.. గూగుల్ వెదర్ సేవలు నిలిపివేత!
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్లకు షాక్ ఇచ్చింది. చాలా మంది ఉపయోగించే క్లాసిక్ గూగుల్ వెదర్ ఫీచర్‌ను గూగుల్ ఇక నిలిపివేస్తోంది. ఇకపై పాత మినీ యాప్ కనిపించదు. దాని స్థానంలో గూగుల్ సెర్చ్‌లో కొత్త డిజైన్‌తో వెదర్ సమాచారం కనిపించనుంది. ఈ మార్పుతో ఆండ్రాయిడ్ ఫోన్లలో వాతావరణ సమాచారం చూపించే విధానం పూర్తిగా మారిపోయింది. 9to5Google నివేదిక ప్రకారం, ఇంతవరకు నేరుగా గూగుల్ వెదర్ స్క్రీన్‌కి తీసుకెళ్లే షార్ట్‌కట్ ఇప్పుడు సెర్చ్ రిజల్ట్స్ పేజీకి రీడైరెక్ట్ అవుతోంది. ముందుగా గూగుల్ యాప్‌లో ఫుల్ స్క్రీన్‌లో ఓపెన్ అయ్యే వెదర్ అనుభవం ఉండేది. గూగుల్ ప్రత్యేకంగా ఇచ్చే "ఫ్రోగీ" బ్యాక్‌గ్రౌండ్‌తో డిస్ట్రాక్షన్ లేకుండా వాతావరణ సమాచారం చూపించేది.
వివరాలు
పిక్సెల్ కాకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఇది చాలా ఫాస్ట్ ఆప్షన్
ప్రస్తుత ఉష్ణోగ్రత, 10 రోజుల ఫోరకాస్ట్, సేవ్ చేసిన నగరాల మధ్య సులభంగా మారే అవకాశం ఉండేది. ఎలాంటి ప్రకటనలు లేకుండా, అదనపు సెర్చ్ లింకులు లేకుండా క్లియర్‌గా సమాచారం అందించేది. ముఖ్యంగా పిక్సెల్ కాకుండా ఇతర ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవారికి ఇది చాలా ఫాస్ట్ ఆప్షన్‌గా ఉండేది. ఇకపై అదే షార్ట్‌కట్ ద్వారా ఓపెన్ అయితే గూగుల్ సెర్చ్ రిజల్ట్స్ పేజీ కనిపిస్తుంది. అందులో గంటల వారీ ఫోరకాస్ట్, 10 రోజుల అంచనా, ఎయిర్ క్వాలిటీ వివరాలు వంటి పూర్తి సమాచారం ఉంటుంది.
వివరాలు
కొత్త డిజైన్‌తో ఎక్కువ సమాచారం
అయితే ఇతర సెర్చ్ లింకులు, సంబంధించిన ప్రశ్నలు కూడా కనిపిస్తాయి. కొత్త డిజైన్‌తో ఎక్కువ సమాచారం అందుతున్నా, పాత ఫ్రోగీ స్క్రీన్ ఇచ్చిన సింపుల్ అనుభవం మాత్రం ఉండదు. ఇక Google Pixel యూజర్లకు ఈ మార్పు పెద్దగా ప్రభావం ఉండదు. ఎందుకంటే ఆ ఫోన్లలో ప్రత్యేకంగా Pixel Weather యాప్ అందుబాటులో ఉంటుంది. కానీ ఇతర ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రం ఈ మార్పు స్పష్టంగా కనిపించనుంది. వేర్వేరు మినీ యాప్స్‌కి బదులుగా అన్ని సేవలను సెర్చ్‌లోనే కలపాలన్న గూగుల్ కొత్త వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.