Loading...
Google: జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు
జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు

Google: జెమినీ వేగం పెంచేందుకు 'ఫ్రోజన్ v2' చిప్‌పై గూగుల్ కసరత్తు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

జెమినీ కృత్రిమ మేధ (AI) మోడళ్ల పనితీరును మరింత వేగవంతం చేసేందుకు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొత్త సర్వర్ చిప్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. సంస్థ అంతర్గతంగా దీనికి 'ఫ్రోజన్ v2' (Frozen v2) అనే కోడ్ పేరు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కొత్త తరం చిప్‌పై మొదటగా ది ఇన్ఫర్మేషన్ నివేదిక వెలుగులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం గూగుల్ ఉపయోగిస్తున్న AI చిప్‌లతో పోలిస్తే ఇది ఆరు నుంచి పది రెట్లు అధిక సామర్థ్యాన్ని అందించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. ఈ చిప్‌ను 2028లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

వివరాలు 

జెమిని ఆర్కిటెక్చర్‌లోని భాగాలను ఏకీకృతం చేసే చిప్

ఈ చిప్‌ను ప్రత్యేకంగా జెమినీ AI కోసం రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.

జెమినీ మోడల్ నిర్మాణంలోని కొన్ని కీలక భాగాలను నేరుగా చిప్‌లోనే సమీకరించేలా దీన్ని రూపొందిస్తున్నారని సమాచారం.

దీంతో ఒకే లెక్కలను పదేపదే చేయాల్సిన అవసరం తగ్గి, వినియోగదారుల ప్రశ్నలకు మరింత వేగంగా సమాధానాలు ఇవ్వగలదని భావిస్తున్నారు.

అంతేకాకుండా డేటా బదిలీ కూడా తగ్గడంతో విద్యుత్ వినియోగం తగ్గి, మొత్తం వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంది.

వివరాలు 

'ఫ్రోజెన్ 2' నివేదికపై గూగుల్ స్పందన

ఫ్రోజన్ v2 చిప్‌పై వచ్చిన వార్తలపై స్పందించిన గూగుల్ ఈ సమాచారం నిజమా కాదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదు.

అయితే వినియోగదారులు, వ్యాపార సంస్థలకు అత్యుత్తమ పనితీరు, సామర్థ్యం అందించేందుకు తమ బృందాలు ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలపై పరిశోధనలు, ప్రయోగాలు చేస్తున్నాయని తెలిపింది.

ప్రతి ప్రాజెక్టు ఉత్పత్తి దశకు చేరకపోయినా, ఇటువంటి పరిశోధనలు తమ సాంకేతిక వ్యూహంలో కీలక భాగమని పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు 

చిప్ గూగుల్ TPUలను భర్తీ చేయదు

అయితే ఈ కొత్త చిప్ గూగుల్ ప్రస్తుతం ఉపయోగిస్తున్న టెన్సర్ ప్రాసెసింగ్ యూనిట్లు (TPUs)కు ప్రత్యామ్నాయంగా రాదని సమాచారం.

వీటితో పాటు ప్రత్యేక అవసరాల కోసం ఉపయోగించే AI హార్డ్‌వేర్‌లో మరో ప్రత్యేక చిప్‌గా ఇది చేరనుంది.

అదే స్థాయి విద్యుత్ వినియోగంతో ప్రస్తుత TPUs కంటే ఆరు నుంచి పది రెట్లు ఎక్కువ AI టోకెన్లను రూపొందించే సామర్థ్యం దీనికి ఉండవచ్చని గూగుల్ ఇంజినీర్లు అంచనా వేస్తున్నారు.

సంస్థలో పెరుగుతున్న AI కంప్యూటింగ్ అవసరాలను తీర్చేందుకు 2028 నాటికి ఈ చిప్‌ను వినియోగంలోకి తీసుకురావాలని గూగుల్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT