LOADING...
Google Circle to Search: గూగుల్ కొత్త ఫీచర్.. ఏఐ ఫోటోలను ఇక ఈజీగా గుర్తించొచ్చు
గూగుల్ కొత్త ఫీచర్.. ఏఐ ఫోటోలను ఇక ఈజీగా గుర్తించొచ్చు

Google Circle to Search: గూగుల్ కొత్త ఫీచర్.. ఏఐ ఫోటోలను ఇక ఈజీగా గుర్తించొచ్చు

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
08:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించిన ఫోటోలు,వీడియోలు,ఆడియోలను గుర్తించడం ఇప్పుడు మరింత సులభం కానుంది. టెక్ దిగ్గజం గూగుల్ తన AI కంటెంట్ డిటెక్టర్ సేవలను Gemini యాప్‌కే పరిమితం కాకుండా Chrome బ్రౌజర్, Google Search వరకూ విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. సంస్థ వార్షిక డెవలపర్ ఈవెంట్ Google I/Oలో ఈ విషయాన్ని వెల్లడించింది. Google రూపొందించిన 'SynthID' అనే ప్రత్యేక invisible watermark టెక్నాలజీ ద్వారా AIతో తయారైన కంటెంట్‌ను గుర్తించవచ్చు. 2025 చివర్లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ ఫీచర్ ఇప్పటివరకు Gemini యాప్‌లో మాత్రమే పనిచేసేది. యూజర్లు ఒక ఫోటోను అప్‌లోడ్ చేసి అది నిజమైనదా లేక AIతో తయారైందా అని తెలుసుకునే అవకాశం ఉండేది.

వివరాలు 

పెరుగుతున్న పారదర్శకత అవసరం

ఇప్పుడు ఈ సేవలను Chrome, Google Searchలోకి తీసుకురావడంతో Circle to Search ఫీచర్ ద్వారా లేదా ఇంటర్నెట్‌లో కనిపించే ఫోటోపై right click చేసి అది AIతో తయారైందా అనే విషయాన్ని చెక్ చేయవచ్చు. Alphabet CEO సుందర్ పిచాయ్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పటివరకు SynthID watermarkను 100 బిలియన్లకు పైగా ఫోటోలు, వీడియోలు, అలాగే వేల సంవత్సరాల నిడివి గల ఆడియో ఫైళ్లపై ఉపయోగించారు. Gemini యాప్‌లో లక్షలాది మంది ఇప్పటికే ఈ డిటెక్టర్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. "Generative AI టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కొద్దీ పారదర్శకత అవసరం కూడా పెరుగుతోంది.

వివరాలు 

'Gemini Omni'లో SynthID watermark వ్యవస్థ

కంటెంట్ అసలు కెమెరాతో తీసిందా? లేక AIతో రూపొందించిందా? అలాగే AI టూల్స్‌తో ఎడిట్ చేశారా? అనే వివరాలు యూజర్లకు స్పష్టంగా చూపించే విధంగా కొత్త verification వ్యవస్థను తీసుకొస్తున్నాం" అని పిచాయ్ తెలిపారు. ఇప్పటివరకు SynthID ద్వారా కేవలం Geminiతో రూపొందించిన కంటెంట్ మాత్రమే గుర్తించగలిగే అవకాశం ఉండేది. అయితే ఇప్పుడు ఇతర AI కంపెనీలతో కూడా Google భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో OpenAI, AI voice generator సంస్థ ElevenLabs, అలాగే NVIDIA కూడా ఉన్నాయి. ఇక Google I/Oలో ప్రివ్యూ చేసిన కొత్త hyper-realistic వీడియో క్రియేషన్ టూల్ 'Gemini Omni'లో కూడా SynthID watermark వ్యవస్థను నేరుగా జోడించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Advertisement