Page Loader
CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం
AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ధర వివరాలు ఇంకా తెలీదు

CES 2023లో సరికొత్త Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ ప్రారంభం

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 05, 2023
09:58 am

ఈ వార్తాకథనం ఏంటి

CES 2023లో గేమింగ్ పరిశ్రమ కోసం Govee మొట్టమొదటిసారిగా AI-ఆధారిత లైటింగ్ సొల్యూషన్‌ను పరిచయం చేయబోతుంది. దీనిని Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ అని అంటారు. ఇది ఆన్-స్క్రీన్ గేమింగ్ కంటెంట్ నుండి కీలక విషయాలను విశ్లేషించడానికి, వాటిని సాంకేతికత ఉపయోగించి మళ్ళీ సరికొత్త లైటింగ్ ఎఫెక్ట్స్ తో చూపించడానికి ఉపయోగపడుతుంది. ఇది 2023లో లాంచ్ అవుతుందని ప్రకటించారు కానీ ధర ఇంకా వెల్లడించలేదు. ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో ఉన్న లైటింగ్ కిట్‌లు పనితీరు వినియోగదారులను ఆకట్టుకునే విధంగా లేవు. అయితే ఈ కిట్ ఆ సమస్యను పరిష్కరించవచ్చు. ఇది బయట లైటింగ్ లో కలిసిపోతుంది, పనితీరు విషయంలో రాజీ పడకపోవడంతో గేమింగ్ ఔత్సాహికులకు బాగా నచ్చుతుంది.

గేమింగ్

ఈ కిట్ తక్కువ గ్యాప్ తో కంటెంట్-రియాక్టివ్ సింక్ చేయగలదు

Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ 16 మిల్లీసెకన్ల కంటే తక్కువ గ్యాప్ తో కంటెంట్-రియాక్టివ్ సింక్ చేయగలదు. ఈ కిట్ ఒకటి కంటే ఎక్కువ డివైజ్ లు కనెక్ట్ చేయడానికి, వాటి మధ్య సులభంగా మార్చుకునే వీలుగా ఒక HDMI అవుట్‌పుట్, మూడు HDMI ఇన్‌పుట్‌లను ఇస్తుంది. Govee AI గేమింగ్ సింక్ బాక్స్ కిట్ AI జాజ్, హిప్-హాప్, రాక్ వంటి సంగీతాన్ని గుర్తించగలదు, రిథమ్‌కు సరిపోయే లైటింగ్ ను కూడా ఇవ్వగలదు. HDR, డాల్బీ విజన్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంట్రోల్ (HDMI-కనెక్ట్ చేయబడిన పరికరాలను నియంత్రించే ఫీచర్) వంటి టెక్నాలజీలకు కూడా సపోర్ట్ చేస్తుంది.