VIDA V1 ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించిన హీరో మోటోకార్ప్
హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ VIDA V1 కస్టమర్ డెలివరీలను ప్రారంభించినట్లు తెలిపింది. బ్రాండ్ నుండి మొదటి ఎలక్ట్రిక్ వాహనం బెంగళూరులో డెలివరీ చేశారు. జైపూర్, ఢిల్లీలో డెలివరీలు జరుగుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. "VIDAతో వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే భవిష్యత్ ఆధారిత మొబిలిటీ ట్రెండ్‌లను నెలకొల్పడం ఆరంభించాము" అని హీరో మోటోకార్ప్ ఛైర్మన్, సీఈఓ పవన్ ముంజాల్ తెలిపారు. ఈ సంవత్సరం అక్టోబర్‌లో, కంపెనీ VIDA V1ని ప్రారంభించడం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించింది. ఇది మార్చుకోగల అవకాశం ఉన్న బ్యాటరీలు, త్రీ వే ఛార్జింగ్ ఆప్షన్ తో వస్తుంది. 80 కిమీ వేగంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 163 కిమీల వరకు నడుస్తుంది.
రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న VIDA V1 స్కూటర్లు
అన్ని ఫీచర్లు, పోర్టబుల్ ఛార్జర్ మరియు ఛార్జింగ్ సేవతో సహా VIDA V1 Plus రూ. 1,35,705, VIDA V1 Pro రూ. 1,46,880 రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. స్కూటర్లు నాలుగు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి. స్పోర్ట్స్, రైడ్, ఎకో, కస్టమ్ ఉన్నాయి. కస్టమ్ మోడ్‌ను ఉపయోగించి, రైడర్ బ్రేక్ రీజెనరేషన్, పనితీరు మొదలైన వాటిని స్వయంగా సెటప్ చేయవచ్చు. రెండు స్కూటర్‌లలోని బ్యాటరీ ప్యాక్ భిన్నంగా ఉంటుంది కానీ రెండూ IP68 రేట్ 3 సంవత్సరాల, 30,000 కిమీ వారంటీతో వస్తాయి. Vida లింప్ హోమ్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఇది రైడర్ ఎక్కడైనా చిక్కుకుపోయే అవకాశాలను తగ్గిస్తుంది.