Weight Loss: ఏఐ ట్రైనర్: జిమ్ లేకుండా 27 కిలోలు బరువు తగ్గి ఆశ్చర్యపరిచిన యువకుడు!
ఈ వార్తాకథనం ఏంటి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం మన రోజువారీ జీవితంలో వేగంగా విస్తరిస్తోంది. ప్రయాణాల ప్లానింగ్, ఆఫీస్ పనుల నిర్వహణ నుండి వ్యక్తిగత లక్ష్యాల సాధన వరకు ఏఐ సహాయపడుతోంది. బరువు తగ్గడం వంటి వ్యక్తిగత గోల్స్ సాధించడంలో కూడా అది కీలక పాత్ర వహిస్తోంది. దీనికి నిదర్శనమే హసన్ అనే 'ఎక్స్' (ట్విట్టర్) యూజర్ కథ . చాట్‌జీపీటీ సహాయంతో అతను ఒక్కసారిగా 27 కిలోల బరువు తగ్గి అందరి దృష్టిని ఆకర్షించాడు.
వివరాలు
తాను వాడిన 7 కీలకమైన ప్రాంప్ట్‌లను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
హసన్ జిమ్‌కి వెళ్ళడం, ఖరీదైన డైట్ ప్లాన్లను అనుసరించడం వంటి మార్గాలను ఎంచుకోలేదు. బదులుగా, చాట్‌జీపీటీని తన వ్యక్తిగత ట్రైనర్‌గా, మార్గదర్శకంగా వాడాడు. ప్రతి రోజూ క్రమంగా, సరైన ప్రాంప్ట్‌ల ద్వారా (ప్రశ్నలు లేదా ఆదేశాలు) ఇస్తూ ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగాడు. "చాట్‌జీపీటీని నా పర్సనల్ ట్రైనర్‌గా భావించి 27 కిలోలు తగ్గాను. రోజూవారీ క్రమశిక్షణ, సరైన ప్రాంప్ట్‌లు నాకు ఒక పద్ధతిని నేర్పాయి" అని హసన్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. తన అనుభవాన్ని ఇతరులకు ప్రేరణగా మార్చుతూ, హసన్ ఉపయోగించిన 7 ముఖ్యమైన ప్రాంప్ట్‌లను కూడా షేర్ చేశాడు.
వివరాలు
క్రమశిక్షణతో ఏఐని సరిగ్గా వాడితే లక్ష్యాలు సులభమన్న హసన్
వీటిలో శరీర విశ్లేషణ, లక్ష్య నిర్ధారణ, సులభంగా అందుబాటులో ఉన్న పదార్థాలతో మీల్ ప్లాన్ ఇంట్లో పరికరాలు లేకుండా చేయగల వర్కౌట్స్, తీపి తినాలనే ఆకాంక్షను నియంత్రించే చిట్కాలు, అలవాట్ల ట్రాకింగ్ విధానం, మానసిక స్థైర్యం కోసం సూచనలు, వారానికి ఒకసారి పురోగతిని సమీక్షించడం వంటి అంశాలు ఉన్నాయి. సరైన మార్గదర్శకత్వం, క్రమశిక్షణ, ఏఐని తెలివిగా వాడితే, జిమ్ లేదా కఠినమైన డైట్ అవసరం లేకుండా బరువు తగ్గడం వంటి వ్యక్తిగత లక్ష్యాలను సులభంగా సాధించవచ్చని హసన్ అనుభవం చెబుతోంది .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చాట్‌జీపీటీని పర్సనల్ ట్రైనర్‌గా వాడుకొని 27 కేజీలు తగ్గిన యువకుడు
I LOST 27 KILOS WITH CHATGPT AS MY PERSONAL TRAINER.
— Hasan (@Ubermenscchh) January 1, 2026
No gym. No expensive apps. No BS.
Just daily discipline + prompts that actually gave me structure.
Here’s the 7 Prompts that can do the same for you: