LOADING...
Google: ఆరోగ్య సమాచారంలో ఏఐ తప్పిదాలు.. గూగుల్‌పై విమర్శలు
ఆరోగ్య సమాచారంలో ఏఐ తప్పిదాలు.. గూగుల్‌పై విమర్శలు

Google: ఆరోగ్య సమాచారంలో ఏఐ తప్పిదాలు.. గూగుల్‌పై విమర్శలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 16, 2026
05:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ ఏఐ ఆధారంగా చూపిస్తున్న AI Overviews వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశముందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన సున్నితమైన ప్రశ్నలు సెర్చ్ చేసినప్పుడు ఫలితాల పైనే కనిపించే ఈ ఏఐ సమాధానాలు, నేరుగా డాక్టర్‌ను సంప్రదించాలని సూచించేందుకు రూపొందించామని గూగుల్ చెబుతున్నప్పటికీ, వాస్తవంలో ఆ హెచ్చరికలు మొదట్లో స్పష్టంగా కనిపించడం లేదని 'ది గార్డియన్' తాజా విచారణలో బయటపడింది. వినియోగదారులు "షో మోర్" అనే బటన్‌పై క్లిక్ చేసి మరిన్ని వివరాలు కోరినప్పుడే డిస్క్లైమర్ కనిపిస్తోందని, అది కూడా ఏఐ ఇచ్చిన మొత్తం వైద్య సమాచారానికి కింద చిన్న అక్షరాల్లో, లేత రంగులో చూపిస్తున్నారని విమర్శలు వచ్చాయి.

వివరాలు 

ఆరోగ్య విషయాల్లో మొదటిసారే స్పష్టమైన హెచ్చరికలు చూపాల్సిందే

"ఇది కేవలం సమాచారానికే, వైద్య సలహా లేదా నిర్ధారణ కోసం నిపుణులను సంప్రదించాలి, ఏఐ సమాధానాల్లో తప్పులు ఉండొచ్చు"అనే హెచ్చరిక ఉన్నా,అది చాలామందికి కనిపించట్లేదన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంపై గూగుల్ స్పందిస్తూ, అవసరమైన చోట్ల ఏఐ సమాధానాల్లోనే వైద్యులను సంప్రదించమని సూచిస్తున్నామని చెప్పినా, ఆరోగ్య విషయాల్లో మొదటిసారే స్పష్టమైన హెచ్చరికలు చూపాల్సిందేనని ఏఐ నిపుణులు, రోగుల హక్కుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.

వివరాలు 

ఆరోగ్య అంశాల్లో ఇది తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుంది 

ఎంఐటీలో పరిశోధకుడైన ప్యాట్ పటరణుటపోర్న్ మాట్లాడుతూ, ఆధునిక ఏఐ మోడళ్లలో కూడా తప్పు సమాచారాన్ని సృష్టించే ప్రమాదం ఉందని, ఆరోగ్య అంశాల్లో ఇది తీవ్ర ప్రమాదానికి దారి తీస్తుందన్నారు. మరోవైపు లండన్ క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ఏఐ ప్రొఫెసర్ జినా నెఫ్, వేగానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే గూగుల్ డిజైన్ వల్ల ఖచ్చితత్వం దెబ్బతింటోందని, ఇది ఆరోగ్య సమాచారంలో ప్రమాదకరమైన తప్పులకు కారణమవుతుందని విమర్శించారు.

Advertisement