LOADING...
Apple: ఆపిల్‌ కంపెనీలో ఏఐ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తారో తెలుసా?
ఆపిల్‌ కంపెనీలో ఏఐ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తారో తెలుసా?

Apple: ఆపిల్‌ కంపెనీలో ఏఐ,సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ఎంత జీతం ఇస్తారో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 04, 2025
05:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్ సంస్థ తన ముఖ్యమైన ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI) ఉద్యోగాల కోసం ఎంత జీతం ఇస్తుందో తాజాగా బహిర్గతమైంది. బిజినెస్‌ ఇన్‌సైడర్‌ అందించిన సమాచారం ప్రకారం, ఆపిల్‌ సాఫ్ట్‌వేర్‌, డేటా, డిజైన్ రంగాల్లో టాప్‌ టాలెంట్‌ను ఆకర్షించేందుకు భారీ జీతాలు అందిస్తోంది. ప్రస్తుతం ఏఐ రంగంలో పోటీ ఎక్కువగా ఉండటంతో ఆపిల్‌ సైతం టాలెంట్ నిలుపుకోవడానికి జీతాలు పెంచుతోంది.

పరిహారం వివరాలు 

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో జీతం ఇలా ఉంటుంది 

ఆపిల్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్లకు కనీసం $132,267 (సుమారు రూ.1.10 కోట్లు) నుంచి గరిష్టంగా $378,700 (సుమారు రూ.3.15 కోట్లు) వరకు జీతం అందుతోంది. డేటా సైంటిస్టులకు $105,550 నుంచి $322,400 వరకు చెల్లిస్తున్నారు. మెషీన్ లెర్నింగ్ ఇంజినీర్లు ($143,100-$312,200), అలాగే మెషీన్ లెర్నింగ్ రీసర్చర్లు కూడా ($114,100-$312,200) ఆపిల్‌లో మంచి జీతాలు పొందుతున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ మేనేజర్లకు గరిష్టంగా $378,700 వరకు జీతం అందుతోంది. డిజైన్ విభాగంలో కూడా జీతాలు ఆకర్షణీయంగానే ఉన్నాయి. హ్యూమన్ ఇంటర్‌ఫేస్ డిజైనర్లకు కనీసం $135,400 నుంచి గరిష్టంగా $468,500 (రూ.3.90 కోట్లు) వరకు చెల్లిస్తున్నారు.

సమాచారం 

హార్డ్‌వేర్ ఇంజినీర్లకు భారీగానే.. 

సాఫ్ట్‌వేర్‌తో పాటు హార్డ్‌వేర్ విభాగంలో కూడా ఆపిల్‌ మంచి జీతాలు అందిస్తోంది. హార్డ్‌వేర్ సిస్టమ్స్ ఇంజినీర్లకు $125,495 నుంచి $378,700 వరకు, AR/VR సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు $129,805 నుంచి $312,200 వరకు జీతాలు ఉన్నాయి. RF/అనలాగ్/మిక్స్‌డ్ సిగ్నల్ ఇంజినీర్లు ($131,352-$312,200) మరియు డిజైన్ వెరిఫికేషన్ ఇంజినీర్లకు కూడా ($103,164-$312,200) భారీ జీతాలు అందిస్తున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా ఆపిల్‌ కంపెనీ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, డిజైన్ రంగాల్లో సమతుల్యతగా అభివృద్ధి చేస్తుందనేది స్పష్టమవుతోంది.

టీం ఫోకస్ 

మెటా కంపెనీలో చేరుతున్న ఆపిల్ ఉద్యోగులు! 

జీతం సమాచారం బయటకు రావడం ప్రస్తుతం ఆపిల్‌ ఏఐ విభాగం ఎదుర్కొంటున్న సవాళ్ల మధ్య జరిగింది. ఇటీవల ఆపిల్ ఫౌండేషన్ మోడల్స్ (AFM) గ్రూప్‌లో పనిచేస్తున్న నలుగురు ఇంజినీర్లు మెటా (ఫేస్‌బుక్ మాతృ సంస్థ) లో చేరినట్టు సమాచారం. దీంతో సంస్థ టాప్‌ ఏఐ, ఎంఎల్ టాలెంట్‌కు జీతాలు పెంచే దిశగా పయనిస్తోంది. జనరేటివ్ ఏఐ, ఆన్-డివైస్ ఇంటెలిజెన్స్, పర్సనలైజేషన్ ఫీచర్లపై దృష్టి సారిస్తూ, ఎంఎల్, ఏఆర్/వీఆర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, డేటా సైన్స్ విభాగాల్లో భారీగా నియామకాలు చేపడుతోంది.