Page Loader
DIGIPIN: డిజిపిన్‌తో ఖచ్చితమైన చిరునామా.. ఎలా పొందాలంటే?
డిజిపిన్‌తో ఖచ్చితమైన చిరునామా.. ఎలా పొందాలంటే?

DIGIPIN: డిజిపిన్‌తో ఖచ్చితమైన చిరునామా.. ఎలా పొందాలంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 15, 2025
12:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

పిన్‌కోడ్‌ ఉన్నా కొన్ని చోట్ల ఖచ్చితమైన చిరునామా చెప్పడం కష్టమయ్యే సందర్భాల్లో, భారత తపాలాశాఖ వినూత్న పరిష్కారం తీసుకొచ్చింది. అదే డిజిపిన్‌ (DIGIPIN). ఇది పూర్తిగా డిజిటల్‌ ఆధారిత చిరునామా వ్యవస్థ. దీని సాయంతో ప్రతి ఇంటికీ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. చిరునామా లేకుండా కూడా ఖచ్చితమైన లొకేషన్‌ను చేరుకోవచ్చనే లక్ష్యంతో తపాలాశాఖ ఈ వ్యవస్థను అభివృద్ధి చేసింది.

Details

డిజిపిన్‌ ఎలా పొందాలి?

1. భారత తపాలా శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లాలి. 2. అక్కడ 'Know Your Pincode' → 'Know Your DIGIPIN'పై క్లిక్‌ చేయాలి. 3. మీ బ్రౌజర్‌లో లొకేషన్‌ యాక్సెస్‌ తప్పనిసరిగా ఆన్‌లో ఉండాలి. 4. పాపప్‌ కనిపించగానే 'Allow'పై క్లిక్‌ చేయాలి. 5. అంతే.. స్క్రీన్ కుడివైపు కింద 10 అంకెల ఆల్ఫా న్యూమరిక్‌ డిజిపిన్‌ కనిపిస్తుంది. 6. లేదా తపాలాశాఖ ప్రత్యేకంగా అందించిన లింక్‌ ద్వారా కూడా మీ డిజిపిన్‌ పొందవచ్చు.

Details

 డిజిపిన్‌తో ప్రత్యేకతలు 

ఈ 10 అంకెల కోడ్‌ ద్వారా మీ ఇంటిని, భవనాన్ని ఖచ్చితంగా గుర్తించొచ్చు. దీనిని కాపీ చేయడం, షేర్ చేయడం, ఫేవరెట్స్‌గా సేవ్‌ చేయడం, వాయిస్ ద్వారా వినడం వంటి ఫీచర్లు ఉన్నాయి. QR కోడ్‌ కూడా దీనికి రూపొందించవచ్చు. మ్యాప్‌లో ఏ ప్రదేశాన్ని ఎంచుకున్నా ఆ ప్రదేశానికి అనుసంధానించిన డిజిపిన్‌ కనిపిస్తుంది. ఇప్పటికే ఉన్న డిజిపిన్‌ ఎంటర్‌ చేసి సెర్చ్‌ చేస్తే ఆ లొకేషన్ మ్యాప్‌లో కనిపిస్తుంది. అక్షాంశాలు - రేఖాంశాల ఆధారంగా కూడా డిజిపిన్‌ను తెలుసుకోవచ్చు.

Details

డిజిపిన్‌ ఉపయోగాలు

అత్యవసర సేవలు (అంబులెన్స్‌, అగ్నిమాపక సేవలు) అందించే సమయంలో ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, చిరునామా లేకున్నా డెలివరీ అవసరాల కోసం ఉపయోగపడుతుంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ వంటి ఈ-కామర్స్‌ సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఈ డిజిపిన్‌ను ఇస్రో అనుబంధ నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, ఐఐటీ హైదరాబాద్ తో కలిసి అభివృద్ధి చేశారు. ఇది చిరునామా స్థానంలో భౌగోళిక సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కావున గోప్యతకు భంగం ఉండదు. కేవలం నాలుగు చదరపు మీటర్ల ప్రాంతానికి కూడా డిజిపిన్‌ తయారు చేయవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ఎక్కడైనా ఖచ్చితమైన చిరునామా అవసరం ఉన్నపుడు డిజిపిన్‌ ఉపయోగకరంగా నిలుస్తుంది. ఇది భవిష్యత్‌ డిజిటల్ చిరునామాల దిశగా పెద్ద అడుగుగా చెప్పుకోవచ్చు.