NanoBananaPro:1880ల నుంచి 2025 వరకూ AI పోట్రైట్ లు ఎలా తయారు చేయాలి?: గూగుల్ ఇచ్చిన Nano Banana Pro గైడ్
ఈ వార్తాకథనం ఏంటి
X ప్లాట్‌ఫారమ్‌లోని అధికారిక Nano Banana Pro అకౌంట్ వేసిన ఒక ఫన్-ఫుల్ ప్రాంప్ట్ సోషల్ మీడియాలో కొత్త విజువల్ ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. "హ్యూమనాయిడ్ బనానా"గా కనిపించే క్యారెక్టర్ ఇచ్చిన ఆ సూచనల్లో 1880ల నుంచి మొదలుకొని మొత్తం 16 దశాబ్దాల్లో మన రూపాన్ని 4×4 గ్రిడ్‌గా రూపొందించమని సూచించారు.
వివరాలు
1880ల నుంచి 2025 వరకూ మీ సొంత డికేడ్ గ్రిడ్ ఇమేజ్ ఎలా చేసుకోవాలి?
సోమవారం షేర్ చేసిన పోస్ట్‌లో Nano Banana Pro, ప్రతి దశాబ్దానికి సరిపడేలా దుస్తులు, హెయిర్‌స్టైల్, యాక్సెసరీస్, కలర్స్, బ్యాక్‌డ్రాప్, ఫిల్మ్ స్టైల్.. ఆ దశాబ్దానికి తగ్గట్టే అన్నీ సరిపోయేలా.. ఉండేలా క్యారెక్టర్‌ను చూపాలని చెప్పింది. ఈ సరదా స్టైల్ సూచనలు ప్లాట్‌ఫార్మ్ దృష్టిని వెంటనే ఆకర్షించాయి, వేల సంఖ్యలో రియాక్షన్లు వచ్చాయి. అదే పోస్టులో, యూజర్లు తమ ఫోటోలు Google Gemini 3కి అప్‌లోడ్ చేసి, Nano Banana Pro మోడల్‌తో 19వ శతాబ్దం చివర నుంచి నేటి వరకు.. దశాబ్దాల వారీ మార్పులను ఎలా జెనరేట్ చేసుకోవచ్చో కూడా చూపించారు.
వివరాలు
Nano Banana Pro షేర్ చేసిన ప్రాంప్ట్ :
"1880లతో ప్రారంభమయ్యే 4×4 గ్రిడ్ చేయండి. ప్రతి బ్లాక్‌లో ఆ దశాబ్దానికి తగ్గట్లుగా నా లుక్ (క్లోతింగ్, హెయిర్‌స్టైల్, ఫేషియల్ హెయిర్, యాక్సెసరీస్) మార్చండి. రంగులు, బ్యాక్‌గ్రౌండ్, ఫిల్మ్ స్టైల్ కూడా ఆ దశాబ్దానికి తగ్గట్టే ఉంచండి." యూజర్లు చెబుతున్న ఫలితాలు: 'అసలైనట్టే ఉన్నాయి!' ఈ టెంప్లేట్‌తో చాలామంది—ఇమేజ్ జనరేషన్ టూల్స్ కొత్తవారైనా సరే—ఎక్స్‌పెరిమెంట్ చేసి తమ గ్రిడ్స్‌ను షేర్ చేశారు. ప్యానెల్స్ పూర్తిగా ఆ యుగానికి తగ్గ ఫ్యాషన్, ఫోటోగ్రఫీ స్టైల్‌ను క్యాప్చర్ చేశాయని, "అద్భుతంగా రియలిస్టిక్" అని చాలా మంది అభిప్రాయపడ్డారు.
వివరాలు
Nano Banana Pro అంటే ఏమిటి?
Nano Banana Pro అనేది Google రూపొందించిన తాజా ఇమేజ్-జనరేషన్ మోడల్. ఇది Gemini 3 Pro మీద ఆధారపడి పని చేస్తుంది. యూజర్ చెప్పిన వివరాలను బట్టి ఇమేజ్‌ను సరిగ్గా తయారు చేయడమే కాకుండా, ఇప్పటికే ఉన్న ఫోటోలో కావలసిన భాగాలను కూడా మార్చగలదు. Google చెప్పిన ప్రకారం, ఇది పాత Nano Banana మోడల్ కంటే ఎక్కువ శక్తివంతం, కచ్చితమైనది, క్రియేటివ్‌గా పని చేస్తుంది.
వివరాలు
Nano Banana Pro ఎలా పనిచేస్తుంది?
ఈ టూల్‌కి ఆధారం Gemini 3 Proలోని అడ్వాన్స్డ్ రీజనింగ్ సామర్థ్యాలు.అందువల్ల యూజర్ ఇచ్చిన ప్రాంప్ట్‌లను మరింత ఖచ్చితంగా అర్థం చేసుకుని రిజల్ట్ ఇస్తుంది. ఇది Google Search నుండి తాజా సమాచారాన్ని కూడా ఉపయోగించగలదు. ఉదాహరణకు నేటి వాతావరణం,రియల్-టైమ్ మ్యాచ్ ఫలితాలు వంటి ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా కూడా ఇమేజ్‌లు సృష్టిస్తుంది. ఇమేజ్‌లలో టెక్స్ట్‌ను కూడా జోడించే సామర్థ్యం ఇందులో ఉంది. అవును.Google చెబుతున్నట్లుగా, Nano Banana Proలో క్లియర్‌గా చదవగలిగే టెక్స్ట్‌ను నేరుగా ఇమేజ్‌లోనే ఉంచే సామర్థ్యం ముఖ్య ఫీచర్. చిన్న లేబుల్ నుంచి పెద్ద టెక్స్ట్ బ్లాక్ వరకూ వేసుకోవచ్చు.అదనంగా,మల్టిపుల్ లాంగ్వేజెస్ సపోర్ట్ ఉండడంతో పోస్టర్లు,ఇన్ఫోగ్రాఫిక్స్,సోషల్ మీడియా కంటెంట్,స్కూల్ అసైన్‌మెంట్స్.. ఇలాంటి అన్ని క్రియేషన్లను సులభంగా తయారు చేయవచ్చు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
Nano Banana Pro చేసిన ట్వీట్
"Make a 4×4 grid starting with the 1880s. In each section, I should appear styled according to that decade (clothing, hairstyle, facial hair, accessories). Use colors, background, & film style accordingly.
— Nano Banana Pro (@NanoBanana) November 23, 2025
PS: I am a humanoid banana." pic.twitter.com/bGG9UvxAv2