LOADING...
Instagram: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి
ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి

Instagram: ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యిందా? ఇలా మీ ఆండ్రాయిడ్ ఫోన్‌తో తిరిగి రికవర్ చేయండి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
12:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి యాక్సెస్ పోతే రోజువారీ పనులే గందరగోళమవుతాయి. ఎన్నేళ్లుగా పెట్టిన ఫొటోలు, చాట్స్ ఒక్కసారిగా లాక్ అయిన స్క్రీన్ వెనకాలకి వెళ్లిపోతే ఎవరికైనా టెన్షన్‌ వస్తుంది. కానీ ఆందోళన అవసరం లేదు. ఆండ్రాయిడ్ ఫోన్ ద్వారా అకౌంట్‌ను తిరిగి మీ కంట్రోల్‌లోకి తీసుకునే పద్ధతులు ఇన్‌స్టాగ్రామ్ అందిస్తోంది. కొంచెం టైమ్ పట్టినా, స్టెప్-బై-స్టెప్‌గా ఫాలో అయితే ఎక్కువ మంది యూజర్లు తమ అకౌంట్‌ని రికవర్ చేసుకుంటున్నారు.

వివరాలు 

సెక్యూరిటీ ఈమెయిల్ చెక్ చేయండి

ఎవరైనా మీ అకౌంట్‌కి సంబంధించిన ఈమెయిల్ మార్చడానికి ప్రయత్నిస్తే Instagram నుండి security@mail.instagram.com నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్‌లోని Secure My Account క్లిక్ చేస్తే హ్యాకర్ చేసిన మార్పులు రద్దు అవుతాయి, మీ పాత వివరాలే తిరిగి వస్తాయి. కానీ మీ పాస్‌వర్డ్, ఇతర సమాచారాన్ని కూడా మార్చేశారనుకోండి, మీ ఈమెయిల్‌కి యాక్సెస్ లేకపోతే, ఇన్‌స్టాగ్రామ్‌లోని రికవరీ ఆప్షన్స్‌నే ప్రయత్నించాలి. లాగిన్ స్క్రీన్ నుంచే రికవరీ ప్రారంభించండి మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో Instagram ఓపెన్ చేసి లాగిన్ పేజీపై Get help logging in పై టాప్ చేయండి. ఇది లాగిన్ అవ్వలేని పరిస్థితుల్లో యూజర్లు రికవరీ కోసం ఉపయోగించే మొదటి స్టెప్.

వివరాలు 

లాగిన్ లింక్ పంపించుకోవడం

మీ యూజర్‌నేమ్, రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్ టైప్ చేసి Send login link క్లిక్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ మీ ఈమెయిల్ లేదా ఫోన్‌కి ఒక లాగిన్ లింక్ పంపుతుంది. మధ్యలో ఒక captcha కూడా వెరిఫై చేయాలి. లింక్ ఓపెన్ చేసి సూచనలు ఫాలో అయి లాగిన్ ప్రయత్నించండి. రిజిస్టర్డ్ నెంబర్/ఈమెయిల్ యాక్సెస్‌లో లేకపోతే, Instagram support పేజీలో మరిన్ని ఆప్షన్స్ ఉంటాయి. సెక్యూరిటీ కోడ్ అడగడం లాగిన్ లింక్ రాకపోతే లేదా ఓపెన్ కాకపోతే, సెక్యూరిటీ కోడ్ పంపమని రిక్వెస్ట్ చేయండి. ప్రస్తుతానికి మీ వద్దున్న ఏదైనా ఆక్టివ్ ఈమెయిల్ ఇవ్వండి. ఆ ఈమెయిల్‌కే తర్వాతి వెరిఫికేషన్ స్టెప్స్ వస్తాయి.

వివరాలు 

ఫొటోలు లేని అకౌంట్ల కోసం వెరిఫికేషన్

మీ అకౌంట్‌లో వ్యక్తిగత ఫొటోలు లేకపోతే, మీరు మొదట అకౌంట్ ఓపెన్ చేసిన ఈమెయిల్, ఫోన్ నెంబర్, అప్పట్లో వాడిన డివైస్ వంటి వివరాలు అడగవచ్చు. ఇవి సరిగ్గా ఇస్తే వెరిఫికేషన్ త్వరగా పూర్తవుతుంది. వ్యక్తిగత ఫొటోలు ఉన్న అకౌంట్ల కోసం వెరిఫికేషన్ మీ అకౌంట్‌లో మీ ఫొటోలు ఉన్నాయంటే, చిన్న సెల్ఫీ వీడియో వెరిఫికేషన్ చేయమని చెబుతారు. కెమెరా ముందు తలని కొంచెం పక్కపక్కలా కదిలిస్తూ వీడియో రికార్డ్ చేయాలి. ఇది కేవలం వెరిఫికేషన్‌కే.. 30 రోజుల్లో వీడియో ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది.

వివరాలు 

అకౌంట్ రికవర్ అయ్యాక..

యాక్సెస్ తిరిగి దక్కగానే మీ పాస్‌వర్డ్ మార్చండి. రెండు స్టెప్స్‌తో వచ్చే two-factor authentication ఆన్ చేయండి. మీ అకౌంట్‌కు లింక్ అయిన ఆప్స్, ప్రొఫైల్స్ చెక్ చేసి అనుమానాస్పదమైనవుంటే వెంటనే రిమూవ్ చేయండి. భవిష్యత్తులో అకౌంట్ మళ్లీ హ్యాక్ కాకుండానే ఇవన్నీ ఉపయోగపడతాయి.