Humanoid robots: ప్రపంచంలోనే తొలి ఘనత.. హ్యుమనాయిడ్ రోబోలతో విజయవంతమైన లైవ్ సర్జరీ
ఈ వార్తాకథనం ఏంటి
వైద్యరంగంలో సాంకేతికత మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా రెండు హ్యుమనాయిడ్ రోబోలు జీవులపై శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించి కొత్త చరిత్ర సృష్టించాయి. ఈ వినూత్న ప్రయోగాన్ని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ డియాగోకు చెందిన ఇంజినీర్లు, సర్జన్ల బృందం చేపట్టింది. ఈ పరిశోధనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇటీవల ప్రముఖ శాస్త్రీయ పత్రిక నేచర్‌లో ప్రచురితమయ్యాయి.
వివరాలు
రోబోలకు 'సర్జీ' అనే పేరు..
ఈ పరిశోధనలో భాగంగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి రెండు జీవులపై శస్త్రచికిత్సలు చేపట్టారు. మొదటి ఆపరేషన్‌లో ఒక రోబో వైద్యుడి పర్యవేక్షణ, సహకారంతో శస్త్రచికిత్సను పూర్తి చేసింది. రెండో ఆపరేషన్‌లో మాత్రం రెండు హ్యుమనాయిడ్ రోబోలు పరస్పరం సమన్వయంతో కలిసి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించడం విశేషంగా నిలిచింది. ఈ ప్రయోగాల్లో ఉపయోగించిన రోబోలకు పరిశోధకులు 'సర్జీ' అనే పేరు పెట్టారు. ప్రారంభ దశలో ఈ ప్రయోగాలు ఆశించిన ఫలితాలను అందించినప్పటికీ, ప్రస్తుతం వీటిని నేరుగా మనుషులపై ఉపయోగించే పరిస్థితి లేదని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మానవులపై శస్త్రచికిత్సలు నిర్వహించాలంటే ఈ సాంకేతికత మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని వారు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నెట్టింట పోస్ట్ వైరల్..
Omg.. Unitree G1 Enters the Operating Room 🤯!
— SciTech Era (@SciTechera) July 9, 2026
World's First Teleoperated Humanoid Robot Surgery
"Researchers from the University of California San Diego demonstrated the world's first teleoperated humanoid robot assisting in surgery using the Unitree G1."
"The 29-DoF humanoid… pic.twitter.com/aIh9fiFmPn