IBM and Yotta: భారత్‌లోనే డేటా నియంత్రణ.. కొత్త ఏఐ ప్లాట్‌ఫామ్‌ను తీసుకొచ్చిన ఐబీఎం
ఈ వార్తాకథనం ఏంటి
భారత వ్యాపార సంస్థల కోసం ఐబీఎం (IBM), యొట్టా డేటా సర్వీసెస్ (Yotta Data Services) కలిసి కొత్త సార్వభౌమ కృత్రిమ మేధ (AI) ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించాయి. డేటా, కార్యకలాపాలపై నియంత్రణ కోల్పోకుండా ఏఐ ఏజెంట్లను వినియోగించుకోవాలనుకుంటున్న సంస్థలకు ఈ వేదిక ఉపయోగపడనుంది. ఐబీఎంకు చెందిన వాట్సన్‌ఎక్స్ ఆర్కెస్ట్రేట్ (watsonx Orchestrate), యొట్టా శక్తి క్లౌడ్ (Shakti Cloud), శక్తి స్టూడియో (Shakti Studio)లను కలిపి భారత్‌లో ఏఐ నిర్వహణకు సమగ్ర పరిష్కారాన్ని రూపొందించారు.
వివరాలు
సంస్థల స్థాయిలో ఏఐ ఏజెంట్ల నిర్వహణ
సంస్థలు పెద్ద స్థాయిలో ఏఐ ఏజెంట్లను రూపొందించడం, అమలు చేయడం, నిర్వహించడంతో పాటు వాటిపై పర్యవేక్షణ కొనసాగించేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
డేటా, ఏఐ ఇన్‌ఫరెన్స్, గవర్నెన్స్ నియంత్రణలు భారత్‌లోనే ఉండేలా దీనిని అభివృద్ధి చేశారు.
ఐబీఎం వాట్సన్‌ఎక్స్ ఆర్కెస్ట్రేట్ సంస్థవ్యాప్తంగా ఏఐ ఏజెంట్లను నిర్వహించేందుకు, వాటికి భద్రత కల్పించేందుకు కంట్రోల్ లేయర్‌గా పనిచేస్తుంది.
యొట్టా శక్తి క్లౌడ్ కంప్యూటింగ్, జీపీయూ మౌలిక సదుపాయాలు, నెట్‌వర్కింగ్, భద్రతను అందిస్తుంది.
శక్తి స్టూడియో ద్వారా సంస్థలు తమకు అవసరమైన ఓపెన్‌సోర్స్ లేదా సొంత ఏఐ మోడళ్లను రూపొందించడం, ఫైన్‌ట్యూన్ చేయడం, అమలు చేయడం చేయొచ్చు.
వివరాలు
వివిధ వ్యాపార అవసరాలకు వినియోగం
ఏఐపై ప్రయోగాత్మకంగా చేపట్టే ప్రాజెక్టుల నుంచి పూర్తిస్థాయి ఉత్పత్తి వినియోగానికి సంస్థలను తీసుకెళ్లేలా ఈ ప్లాట్‌ఫామ్‌ను రూపొందించారు.
భద్రతా కార్యకలాపాలు, డాక్యుమెంట్ ప్రాసెసింగ్, హెచ్‌ఆర్ ఆటోమేషన్ వంటి పలు అవసరాలకు దీనిని ఉపయోగించుకోవచ్చు.
''సంస్థలు ఏఐని ప్రయోగాత్మక దశ నుంచి పూర్తిస్థాయి వినియోగానికి తీసుకెళ్తున్న సమయంలో డిజిటల్ సార్వభౌమత్వం, ఓపెన్‌సోర్స్ మోడళ్ల అవసరం కీలకంగా మారుతోంది'' అని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ తెలిపారు.
వివరాలు
డేటాకు సంబంధించిన ప్రక్రియలన్నీ భారత్‌లోనే
కొత్త ప్లాట్‌ఫామ్‌లో స్థానిక డేటా నియంత్రణకు ప్రాధాన్యం ఇచ్చినట్లు యొట్టా సహ వ్యవస్థాపకుడు, ఎండీ, సీఈఓ సునీల్ గుప్తా తెలిపారు.
సార్వభౌమ ఏఐ మౌలిక సదుపాయాలు, మోడళ్లు, ఇన్‌ఫరెన్స్‌తో పాటు సంస్థలకు అవసరమైన ఏఐ ఏజెంట్లు, గవర్నెన్స్, నిబంధనల అనుసరణ సామర్థ్యాలను ఈ వేదికలో కలిపినట్లు చెప్పారు.
పన్వేల్, గ్రేటర్ నోయిడాలోని యొట్టా క్లౌడ్ ప్రాంతాల ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
దీంతో డేటాకు సంబంధించిన అన్ని ప్రక్రియలు భారత సరిహద్దుల్లోనే కొనసాగుతాయని సంస్థలు తెలిపాయి.