quantum diamond microchip imager: భారతదేశపు మొట్టమొదటి క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్‌ను రూపొందించడానికి TCS IIT-Bతో ఒప్పందం
IIT బాంబే భారతదేశపు మొట్టమొదటి 'క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్'ని రూపొందించడానికి దేశంలోని అతిపెద్ద IT సేవల సంస్థ TCSతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అధికారిక ప్రకటన ప్రకారం,క్వాంటం డైమండ్ మైక్రోచిప్ ఇమేజర్ అయస్కాంత క్షేత్రాల చిత్రాలను ఉత్పత్తి చేయగలదు. ఇది ఆసుపత్రిలో MRI లాగా సెమీకండక్టర్ చిప్‌ల మ్యాపింగ్‌ను'నాన్-ఇన్వాసివ్'(ఏ జీవి/వస్తువులోకి ప్రవేశించకుండా)'నాన్-డిస్ట్రక్టివ్'(హాని కలిగించకుండా)అనుమతిస్తుంది. పిక్వెస్ట్ ల్యాబ్‌లో క్వాంటం ఇమేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ను అభివృద్ధి చేయడానికి టిసిఎస్ నిపుణులు ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ కస్తూరి సాహాతో కలిసి పని చేస్తారు.
చిప్‌ల 'నాన్-డిస్ట్రక్టివ్' టెస్టింగ్ కోసం క్వాంటం ఇమేజింగ్ ప్లాట్ఫారం
ఇద్దరు భాగస్వాములు చిప్‌ల 'నాన్-డిస్ట్రక్టివ్' టెస్టింగ్ కోసం క్వాంటం ఇమేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై పని చేస్తారని, క్వాంటమ్ సెన్సింగ్‌లో తమ నైపుణ్యాన్ని కొత్త ఆవిష్కరణలకు ఉపయోగించుకుంటారని సాహా చెప్పారు. TCS చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ హారిక్ విన్ మాట్లాడుతూ 'రెండవ క్వాంటం విప్లవం' అపూర్వమైన వేగంతో పురోగమిస్తున్నదని, సెన్సింగ్, కంప్యూటింగ్, కమ్యూనికేషన్ టెక్నాలజీలలో అత్యాధునిక సామర్థ్యాలను రూపొందించడానికి వనరులు, నైపుణ్యం అవసరం అన్నారు.