Page Loader
అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు
జాబిల్లిపై విజయవంతంగా దిగిన రోవర్ ప్రజ్ఞాన్

అంతరిక్ష రారాజుగా భారత్.. దక్షిణ ధ్రువంపై కాలుమోపిన ఏకైక దేశంగా రికార్డు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
ద్వారా సవరించబడింది Stalin
Aug 23, 2023
07:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్టాత్మక చంద్రయాన్-3 ప్రాజెక్టుతో ప్రపంచవ్యాప్తంగా భారత్ సరికొత్త రికార్డును సృష్టించింది. అగ్రరాజ్యాలు, అగ్రదేశాలకు అందని భారీ అంతరిక్ష విజయాన్ని సగర్వంగా అందుకుంది. అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ లాంటి దేశాలకు సాధ్యం కానిది ఒక్క భారతదేశం మాత్రమే సాధించి అంతర్జాతీయ అంతరిక్షానికే రారాజుగా నిలిచింది. 140 కోట్ల మంది భారతీయుల కలలను, ఆశయాలను నిజం చేస్తూ చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇంతవరకు ఏ దేశం కూడా కాలుమోపలేదు. ఆఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. సుమారు 15ఏళ్ల క్రితం చందమామపై నీరుందని భారత్ చాటి చెప్పింది. ఇప్పుడు ఏ దేశానికి సాధ్యం కాని, ఎవరికీ తెలియని ప్రాంతం దక్షిణ ధ్రువానికి చేరింది.

 ఇస్రో

ప్రయోగంలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ 

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంపై ఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ స్పందించారు. ఈ ప్రయోగంలో భాగమైన ప్రతి శాస్త్రవేత్తకు కృతజ్ఞతలు తెలిపారు. దేశం కోసం స్ఫూర్తిదాయకమైన ఘనత సాధించినందుకు హృదయం ఉప్పొంగుతోందని సోమ్‌నాథ్ పేర్కొన్నారు. ఇస్రోకు అండగా నిలిచిన ప్రధానమంత్రి మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా తమ అండగా నిలిచిన దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. తమకోసం దేశ ప్రజలు చేసిన ప్రార్థనలు ఫలించాయని సోమనాథ్‌ వివరించారు.