Chandrayaan-3 Timeline: చంద్రయాన్-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. మిషన్‌లోని మిక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగింది. ఈ ప్రయోగం ఆది నుంచి చివరకు ఎంతో ఉత్కంఠగా సాగింది. ప్రతి దశను ఇస్రో విజయవంతంగా పూర్తి చేయడం ద్వారా.. ఈ మిషన్ సక్సెస్ అయ్యింది. అయితే ఇప్పుడు చంద్రయాన్-3 మిషన్‌లోని కీలక ఘట్టాలను ఇప్పుడు గుర్తు చేసుకుందాం.
July6: శ్రీహరికోటలోని సెకండరీ ప్యాడ్ నుంచి చంద్రయాన్-3 మిషన్‌ను జులై 14ను ప్రయోగించనున్నట్లు ఇస్రో వెల్లడి
July 7: వెహికల్ ఎలక్ట్రికల్ అసెస్‌మెంట్‌లు విజయవంతంగా పూర్తి
July 11: చంద్రయాన్-3 'లాంచ్ రిహార్సల్' నిర్వహణ. దాదాపు 24గంటల పాటు పూర్తి ప్రయోగ విధానం రీక్రియేట్
July 14: చంద్రయాన్-3ని విజయంవతంగా ప్రయోగించిన ఇస్రో
ఇస్రో
జులై 15 మొదటి దశ విజయవంతం
July 15: 41762 కిమీ x 173 కిమీ కక్ష్యను చంద్రయాన్ పూర్తి చేసింది. దీంతో మొదటి కక్ష దశ విజయవంతంగా ముగిసింది.
July 17: రెండో దశ ఆర్బిట్ రైజింగ్ విజయంవంతం. 41603 కిమీ x 226 కిమీ కక్షలోకి ప్రవేశించిన చంద్రయాన్-3 మిషన్
July 22: నాలుగో ఆర్బిట్-రైజింగ్ ఆపరేషన్ వియజవంతం. అంతరిక్ష నౌకను 71351 కిమీ x 233 కిమీ కక్షలోకి ప్రవేశపెట్టిన ఇస్రో
July 25: అదనపు ఆర్బిట్-రైజింగ్ విజయవంతంగా అమలు
August 1: చంద్రయాన్-3ని ట్రాన్స్‌లూనార్ ఆర్బిట్ (288 కిమీ x 369328 కిమీ)లోకి ప్రవేశపెట్టిన ఇస్రో.
August 5: చంద్రుడి కక్షలో చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతంగా ప్రవేశపెట్టిన ఇస్రో
ఇస్రో
నేడు విజయవంతంగా పూర్తి
August 6: చంద్రయాన్-3 మిషన్ ఆర్బిట్ వేగం తగ్గింపు
August 9: స్పేస్‌క్రాఫ్ట్ పరిధిని తగ్గిన ఇస్రో
August 14: చంద్రుని ఉపరితలానికి చేరువైన చంద్రయాన్ మిషన్
August 16: చంద్రుడి కక్షలో విజయవంతంగా ఐదోదశ పూర్తి
August 17: ప్రొపల్షన్ సిస్టమ్ నుంచి విజయవంతంగా వేరైన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్
August 18: 'డీబూస్టింగ్' ఆపరేషన్ విజయవంతంగా పూర్తి, కక్ష్యను 113కి.మీ x 157కి.మీకి ఇస్రో కుదించింది.
August 20: చంద్రయాన్ 3మిషన్‌లో చివరి 'డీబూస్టింగ్' ఆపరేషన్ పూర్తి. చంద్రునికి కేవలం 25km x 134km దూరంలో చంద్రయాన్ మిషన్
August 23: ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లీ దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ సేఫ్ ల్యాండింగ్