LOADING...
Arattai App: ఇండియాలో స్వదేశీ యాప్ 'అరట్టై' రిలీజ్.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం!
ఇండియాలో స్వదేశీ యాప్ 'అరట్టై' రిలీజ్.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం!

Arattai App: ఇండియాలో స్వదేశీ యాప్ 'అరట్టై' రిలీజ్.. వాట్సాప్‌కు ప్రత్యామ్నాయం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల యూజర్లు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కు పోటీగా భారతదేశం నుంచి కొత్త యాప్‌ రిలీజైంది. చెన్నై ఆధారిత జోహో కార్పొరేషన్ రూపొందించిన ఈ యాప్ పేరు 'అరట్టై'. ప్రస్తుతానికి అరట్టై యాప్‌ యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో సోషల్‌ నెట్‌వర్కింగ్ విభాగంలో నంబర్-1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ కూడా ఈ యాప్‌ను ప్రోత్సహించాలంటూ పిలుపునిచ్చారు, తద్వారా ఈ యాప్ తెగ వైరల్‌గా మారే అవకాశముంది.

Details

స్వదేశీ టెక్నాలజీ

టెక్నాలజీ రంగంలో స్వయం సమృద్ధిని సాధించాలన్న లక్ష్యంతో జోహో సంస్థ అరట్టై యాప్‌ను అభివృద్ధి చేసింది. యూజర్ల ప్రైవసీని అత్యధిక ప్రాధాన్యతగా తీసుకుని, యూజర్ డేటాను పూర్తిగా భారతదేశంలోనే సురక్షితంగా నిల్వ చేస్తుందని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతానికి ఈ యాప్‌లో కాల్స్‌కు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ ఉంది. త్వరలో మెసేజులకు కూడా ఎన్‌క్రిప్షన్ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

Details

ఫీచర్స్

అరట్టై అంటే తమిళ్‌లో 'మాట్లాడటం' అని అర్థం. యాప్‌లో వాట్సాప్ లాగానే టెక్స్ట్ మెసేజులు, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ అందుబాటులో ఉన్నాయి. స్పష్టమైన క్వాలిటీతో వాయిస్, వీడియో కాల్స్ చేయవచ్చు. యూజర్లు వార్తలు, ఇతర సమాచారం కోసం ఛానెల్స్ సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చు. ఇండియాలోని అన్ని లోకల్ లాంగ్వేజెస్‌లో యాప్ ఉపయోగించవచ్చు. ఇంటర్‌ఫేస్ కూడా వాట్సాప్‌లా సరళంగా ఉంటుంది. జోహో సంస్థ చెప్పిన విధంగా త్వరలో మరిన్ని అప్‌డేట్స్ రావచ్చును, తక్కువ కాలంలోనే అరట్టై యాప్‌ను వాట్సాప్‌కు ప్రత్యామ్యంగా ఉపయోగించగలిగే స్థాయికి తీసుకురాబోతున్నారు.