భారతదేశంలో విడుదల కాబోతున్న Infinix ZERO 5G 2023 సిరీస్
Infinix భారతదేశంలో ZERO 5G 2023 సిరీస్ ను ప్రవేశపెట్టింది, ఇందులో స్టాండర్డ్, టర్బో మోడల్‌లు ఉన్నాయి. స్టాండర్డ్ మరియు టర్బో మోడల్‌లు డైమెన్సిటీ 920, డైమెన్సిటీ 1080 చిప్‌సెట్‌లతో వస్తాయి.ఈ ఫోన్లు ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. Infinix బ్రాండ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు ప్రసిద్ది చెందింది. ఇప్పుడు ఈ బ్రాండ్ ZERO 5G 2022తో 5G విభాగంలోకి ప్రవేశించింది. అయితే గత సంవత్సరం మోడల్‌లో అందుబాటులో ఉన్న టెలిఫోటో కెమెరాతో పాటు స్టాండర్డ్ ZERO 5G 2023, టర్బో రెండూ కస్టమరీ చిప్‌సెట్ అప్‌గ్రేడ్ ఉంటాయి. మార్కెట్ లో Realme 10 Pro, Redmi Note 12 Proతో పోటీ పడుతుంది.
Infinix బ్రాండ్ ZERO 5G 2023 సిరీస్ కోసం మార్వెల్‌తో కలిసి పనిచేసింది
Infinix బ్రాండ్ ZERO 5G 2023 సిరీస్ కోసం మార్వెల్‌తో కలిసి పనిచేసింది. స్టాండర్డ్ ZERO 5G 2023 8GB/128GB కాన్ఫిగరేషన్‌లో వస్తుంది. టర్బో వేరియంట్ 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. రెండు ఫోన్లు కూడా 5GB వర్చువల్ RAMని అందిస్తాయి. ఇవి 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. భారతదేశంలో, Infinix స్టాండర్డ్ ZERO 5G 2023 మోడల్ ధర రూ. రూ. 17,999, తురబో మోడల్ ధర రూ.19,999 ఉంటుంది. ఫిబ్రవరి 11 నుండి ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఎఏ ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయి.