Page Loader
#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే
ముందు, వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తుంది

#DealOfTheDay: నథింగ్ ఫోన్ ఫ్లిప్ కార్ట్ లో రూ. 25,000 మాత్రమే

వ్రాసిన వారు Nishkala Sathivada
Jan 13, 2023
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

నథింగ్ ఫోన్ కి సంబంధించిన హైప్ కొంతవరకు తగ్గింది అయితే భారతదేశంలో ఇది మధ్య-శ్రేణి స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ప్రభావాన్ని చూపుతూనే ఉంది. ఈ ఫోన్ అద్భుతమైన విజువల్ ఎలిమెంట్స్‌తో మంచి ఫీచర్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుత ఆఫర్‌లతో, ఈ ఫోన్ అత్యంత తక్కువ ధరకు పొందవచ్చు. నథింగ్ ఫోన్ 8GB/128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 32,999. కానీ పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులను భర్తీ చేయడానికి బ్రాండ్ ధరను రూ. 33,999కు అమ్ముతున్నారు. విడుదలైన చాలా నెలల తర్వాత, ఇప్పుడు రూ. 8,000 ధర తగ్గుదలతో అంటే రూ. 25,999కు ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ రూ. 1,000 తక్షణ తగ్గింపుతో పాటు రూ. 20,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ఫోన్

ఈ ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది

నథింగ్ ఫోన్ ఎడమవైపు పంచ్-హోల్ కట్-అవుట్, ప్రొపోర్షనల్ బెజెల్స్, అల్యూమినియం ఫ్రేమ్, అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌ తో వస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 6.55-అంగుళాల పూర్తి-HD+ OLED స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో 50MP డ్యూయల్ రియర్ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీల కోసం, 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. ఇందులో 12GB వరకు RAM, 256GB వరకు స్టోరేజ్ ఉంది. వైర్ తో అయితే 33W, వైర్‌లెస్ అయితే 15W, 5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4,500mAh బ్యాటరీతో వస్తుంది. ఇందులో 5G, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS, NFC తో పాటు టైప్-సి పోర్ట్ ఉన్నాయి.