Realme 10 vs Redmi Note 12 ఏది సరైన ఎంపిక
భారతదేశంలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ మార్కెట్లో పోటీపడుతున్న Realme, Redmi వంటి బ్రాండ్‌లు అనేక రకాల ఆఫర్‌లతో కొనుగోలుదార్లను ఆకర్షిస్తున్నారు. ఇటీవల విడుదలైన Redmi Note 12కు పోటీగా Realme భారతదేశంలో Realme 10ని ప్రకటించింది. రెండింటిలో సరైన ఎంపిక గురించి తెలుసుకుందాం. Realme 10 ఎడమవైపున పంచ్-హోల్ ఉంటే, Redmi Note 12కు టాప్ లో ఉంది. రెండింటిలోనూ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. Realme 10 గొరిల్లా గ్లాస్ 5 రక్షణతో వస్తే, Redmi Note12 గొరిల్లా గ్లాస్ 3 రక్షణ అందిస్తుంది. రెండూ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ప్యాక్ అందిస్తున్నాయి.
Realme 10 4G-మాత్రమే సపోర్ట్ చేస్తుంది
Realme 10 4GB/64GB ధర రూ. 13,999, 8GB/128GB ధర రూ. 16,999. ఫ్లిప్‌కార్ట్ లేదా బ్రాండ్ ఇ-స్టోర్ లో జనవరి 15 నుండి అందుబాటులో ఉంటుంది. Redmi Note 12 దాని 4GB/128GB కోసం ధర రూ.17,999, 8GB/128GB ధర రూ. 19,999. ఇది జనవరి 11 నుండి అమెజాన్, Redme స్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది. Redmi Note 12 కంటే Realme 10 అందుబాటులో ఉంది. అయితే, 4G-మాత్రమే ఫోన్ సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, Redmi Note 12 పూర్తి స్థాయి 5G-సామర్థ్యం గల డివైజ్, అయితే ధర కాస్త ఎక్కువుంది. బడ్జెట్ తక్కువగా ఉండి, 5G అవసరం పెద్దగా లేకపోతే Realme 10 సరైన ఎంపిక.