Page Loader
Instagarm : ఇంస్టాగ్రామ్ అప్డేట్.. రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసేందుకు సరికొత్త ఫీచర్
ఇంస్టాగ్రామ్ అప్డేట్.. రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసేందుకు సరికొత్త ఫీచర్

Instagarm : ఇంస్టాగ్రామ్ అప్డేట్.. రీల్స్, పోస్టులు షెడ్యూల్ చేసేందుకు సరికొత్త ఫీచర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 16, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఇంస్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌ను ప్రవేశపెడుతోంది. తాజా మరో కొత్త అప్డేట్‌తో ఇంస్టాగ్రామ్ ముందుకొచ్చింది. ఇకపై ఇంస్టాగ్రామ్ యాప్‌లో ఫాలోవర్ల ఫోటోలు, వీడియోలు, రీల్స్ షేర్ చేసేందుకు వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు ఈ విషయాన్ని మార్క్ జుకర్‌బర్గ్ వెల్లడించారు. ఈ ఫీచర్ వల్ల షేర్ చేసిన రీల్స్, పోస్ట్‌లపై స్టోరీలు, లైక్స్, కామెంట్లు సన్నిహిత స్నేహితుల జాబితాలోని ఇతర సభ్యులకు మాత్రమే కన్పించనున్నాయి. ఈ ఫీచర్ ను ఉపయోగించుకోవాలంటే ఇంస్టాగ్రామ్ యాప్‌లో ముందుగా + అనే అప్షన్ పై నొక్కాలి. తర్వాత కంటెంట్ టైప్ చేసి సెలెక్టు చేయాలి.

Details

వీడియోకు మ్యూజిక్, టెక్ట్స్, స్టిక్కర్లు యాడ్ చేసుకొని అవకాశం

ఒకవేళ మీరు రీల్స్ లేదా పోస్టు సెలెక్టు చేసుకుంటే గ్యాలరీ నుంచి ఫోటో లేదా వీడియోను సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత మీకు నచ్చిన విధంగా కంటెంట్‌ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ఫోటో లేదా వీడియోకు మ్యూజిక్, టెక్ట్స్, స్టిక్కర్లు లాంటివి యాడ్ చేసుకొనే అవకాశం ఉంది. తర్వాత నెక్ట్స్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ ఆప్షన్ కోసం కిందికి స్క్రోల్ చేయాలి. అనంతరం అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ పై నొక్కితే మీకు షెడ్యూల్ కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇక థిస్ పోస్టు అనే ఆప్షన్ ఎంచుకున్న తర్వాత కంటెంట్ పబ్లిష్ అవ్వాల్సిన తేదీ, సమయం ఎంచుకొని నిర్ధారిస్తే ఇంస్టాగ్రామ్‌లో సక్సెస్‌ఫుల్‌గా షెడ్యూల్ అవుతుంది.