iPad Air (2026): ఆపిల్ సర్‌ప్రైజ్ రిలీజ్.. iPad Air (2026) అధికారికంగా లాంచ్
ఈ వార్తాకథనం ఏంటి
iPad Air (2026) Apple Inc. భారత్‌లో అధికారికంగా లాంచ్ అయింది. ఈ కొత్త టాబ్లెట్‌లో శక్తివంతమైన M4 చిప్‌ను కంపెనీ అమర్చింది. గత మోడల్‌తో పోలిస్తే ఇది దాదాపు 30 శాతం వేగంగా పనిచేస్తుందని ఆపిల్ చెబుతోంది. 11 ఇంచులు, 13 ఇంచుల రెండు స్క్రీన్ సైజుల్లో ఇది అందుబాటులోకి వచ్చింది. బ్లూ,పర్పుల్, స్పేస్ గ్రే, స్టార్లైట్ రంగుల్లో కొనుగోలుదారులకు ఎంపిక ఉంటుంది. మార్చి 4 నుంచి ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కాగా,మార్చి 11 నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. 11 ఇంచుల మోడల్ ధర రూ.64,900 నుంచి మొదలవుతుంది. 256GB వేరియంట్ రూ.74,900, 512GB మోడల్ రూ.94,900 కాగా, 1TB స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ రూ.1,14,900గా ఉంది.
వివరాలు
ఎమ్4 చిప్‌తో పాటు ఎనిమిది కోర్ సీపీయూ, తొమ్మిది కోర్ జీపీయూ
వై-ఫై + సెల్యులర్ వెర్షన్ కావాలంటే ప్రతి వేరియంట్‌పై అదనంగా రూ.15,000 చెల్లించాలి. ఇక 13 ఇంచుల మోడల్ ప్రారంభ ధర రూ.84,900. 256GB, 512GB వేరియంట్లు వరుసగా రూ.94,900, రూ.1,14,900 ధరలకు లభిస్తాయి. 1TB స్టోరేజ్ ఉన్న అత్యున్నత మోడల్ రూ.1,34,900గా ఉంది. ఈ వెర్షన్‌లో సెల్యులర్ కనెక్టివిటీకి అదనంగా రూ.10,000 చెల్లించాలి. స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఎమ్4 చిప్‌తో పాటు ఎనిమిది కోర్ సీపీయూ, తొమ్మిది కోర్ జీపీయూ, 12GB ర్యామ్ కలిగి ఉంది. గరిష్టంగా 1TB స్టోరేజ్ అందిస్తుంది. ఐప్యాడ్‌ఓఎస్ 26పై పనిచేస్తుంది.
వివరాలు
ముందుభాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
లిక్విడ్ రెటినా ఐపీఎస్ డిస్‌ప్లేతో 2,732x2,048 పిక్సెల్స్ వరకు రిజల్యూషన్, 264ppi పిక్సెల్ డెన్సిటీ అందిస్తుంది. Apple Pencil Pro,Apple Pencilలకు సపోర్ట్ ఉంది. కెమెరా విషయానికి వస్తే, 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరాతో పాటు 5ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్, 4K 60fps వీడియో రికార్డింగ్ సదుపాయం ఉంది. ముందుభాగంలో 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. కనెక్టివిటీ కోసం సీ1ఎక్స్ సెల్యులర్ మోడమ్, వై-ఫై 7, బ్లూటూత్ 6, ఎన్1 నెట్‌వర్కింగ్ చిప్ సపోర్ట్ ఉన్నాయి. భద్రత కోసం టచ్ ఐడి సెన్సార్‌తో పాటు జైరోస్కోప్, యాక్సిలరోమీటర్, బారోమీటర్, అంబియెంట్ లైట్ సెన్సార్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.