డిజైన్ పరంగా రికార్డు సృష్టించనున్న ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఈ మధ్య కాలంలో పెద్ద డిస్ ప్లే ఉన్న ఫోన్స్ పై మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు ఇష్టాలకు అనుగుణంగా యాపిల్ సంస్థ పెద్ద డిస్ ప్లేలతో మోడల్స్ ను రూపొందిస్తోంది. వచ్చే ఏడాది యాపిల్ విడుదల చేయనున్న ఐఫోన్ 16 ప్రొ, ఐఫోన్ ప్రొ మాక్స్ భారీ డిస్ ప్లేతో మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ఐఫోన్స్ లో ఇప్పటివరకు రానంత అతిపెద్ద డిస్ ప్లేతో ఐఫోన్ 16 ప్రొ మాక్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 16 ప్రొ 6.3 అంగుళాల డిస్ ప్లే,ఐఫోన్ 16 ప్రొ మాక్స్ 6.9 అంగుళాల భారీ డిస్ ప్లేతో రాబోతున్నట్లు డిస్ ప్లే ఇండస్ట్రీ అనలిస్ట్ రాస్ యంగ్ తెలిపారు.
అతిపెద్ద డిస్ ప్లే గా రికార్డు
ఐ ఫోన్ 16 ప్రొ , ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్ ల డిస్ ప్లే సైజ్ కు సంబంధించి ఇది ఓ అంచనా మత్రమే. ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటనను యాపిల్ సంస్థ చేయలేదు. కచ్చితమైన వివరాలను లాస్ ఏంజెలిస్ లో జరిగే డిస్ ప్లే వీక్ కాన్ఫరెన్స్ లో మే 23వ తేదీన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది విడుదల చేసే ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మాక్స్ మోడల్స్ లోనూ ఇదే డిస్ ప్లే సైజ్ ఉండనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నారు. దీంతో ఐ ఫోన్ 16 ప్రొ మాక్స్ అతిపెద్ద ఐఫోన్ డిస్ ప్లే మోడల్గా రికార్డు సృష్టించే అవకాశం ఉంది.