Nokia C22:నోకియా నుంచి మరో బడ్జెట్ ఫోన్.. రూ.10వేల లోపు అదిరిపోయే ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం నోకియా ఇటీవల మార్కెట్లోకి వరుసగా స్మార్ట్ ఫోన్ లను లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ ఫోన్ లను విడుదల చేసింది. ప్రస్తుతం ఇండియాలో నోకియా సీ22 లాంచ్ డేట్ ఖరారైంది. ఈనెల 11వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నోకియా అధికారికంగా వెల్లడించింది. రెండు రోజుల క్రితమే యూరోపియన్ మార్కెట్లో సీ22 విడుదలైంది. బడ్జెట్ రేంజ్ లోనే ఈ 4జీ ఫోన్ ఉండనుంది. ఏఐ కెమెరాలు, మూడు బ్యాటరీ లైఫ్ ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇప్పటికే ఈ ఫోన్ యూరోపియన్ మార్కెట్లో లాంచ్ అవడంతో పూర్తి స్పెసిఫికేషన్లు బయటికొచ్చాయి.
నోకియా సీ22 ధర రూ.10000
నోకియా సీ22 మొబైల్ ధర సూమారు రూ.9500 ఉండనుంది. ఇండియాలో రూ.10వేల లోపు ధరకే ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. చార్కోల్, పర్పుల్, సాండ్ కలర్ ఆప్షన్ లలో వచ్చింది. 6.5 ఇంచుల హెచ్ డీ+ ఎల్ సీడీ డిస్ ప్లేను నోకియా సీ22 కలిగి ఉంది. యూనీఎస్ఓసీ, ఎస్‌సీ9863 ప్రాసెసర్ పై ఈ 4జీ ఫోన్ రన్ కానుంది. 2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండనుంది. ఈ ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉండనున్నాయి. 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ మాక్రో కెమెరాతో ఆకర్షణీయంగా రానుంది. 5000mAh బ్యాటరీతో నోకియా సీ22 వస్తోంది.