పోకో నుంచి కొత్త 5G ఫోన్ లాంచ్.. ధర ఎంతంటే!
ఈ వార్తాకథనం ఏంటి
షావోమీ సబ్ బ్రాండ్ పోకో నుంచి కొత్త 5G ఫోన్ వచ్చేసింది. పోకో ఎఫ్5 మొబైల్ ఇండియాలో మే9వ తేదీన సాయంత్రం 5.30గంటలకు లాంచ్ చేయనున్నారు. ఈ విషయాన్ని పోకో అధికారికంగా ధ్రువీకరించింది.
పోకో ఎఫ్5 5G ఫోన్ పనితీరు అద్భుతంగా ఉందని పోకో ఇండియా స్పష్టం చేసింది. స్నాప్‍డ్రాగన్ 7+ జెన్ 2 ప్రాసెసర్‌తో ఇండియా మార్కెట్‍లోకి రానున్న తొలి ఫోన్‍గా పోకో ఎఫ్5 ఉండనుంది. ప్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ లభించనుంది.
గ్లోబల్ గా అదే సమయంలో పోకో ఎఫ్5 ప్రో కూడా రిలీజ్ కు సిద్ధమైంది. పోకో మాత్రం ఇండియాకు ఎఫ్5మోడల్ మాత్రమే తీసుకొస్తున్నట్లు తెలియజేసింది. పోకో ఎఫ్5 ధర రూ.28వేల నుంచి రూ.29వేల లోపు ఉండనుంది.
Details
ఫోకో ఎఫ్ 5లో అద్భుతమైన ఫీచర్స్
ఫోకో ఎఫ్5 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ లతో రావొచ్చు. 5,000mAh బ్యాటరీ, 67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండనుంది. ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఎంఐటూఐ 14తో పోకో ఎఫ్5 ఇండియాలో అడుగుపెట్టనుంది.
ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఉండే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా పోకో ఎఫ్5 వెనుక ఉన్నట్లు సమాచారం.
8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ కెమెరాలు ఉండొచ్చు. ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్‍గా ఉండనుంది. పోకో ఎఫ్4 5జీకి పోకో ఎఫ్5 సక్సెసర్‌గా రావడం ఈ ఫోన్ ప్రత్యేకత