
క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్.. ధర ఎంతో తెలుసా!
ఈ వార్తాకథనం ఏంటి
క్రేజీ ఫీచర్లతో వస్తున్న వన్ ప్లస్ ప్యాడ్ ట్యాట్ ధర వివరాలు వచ్చేశాయి. ఇండియాలో తొలి ట్యాబ్ అయిన ఈ ప్యాడ్ ధర, ఆఫర్ల వివరాలను వన్ ప్లస్ మంగళవారం వెల్లడించింది.
ఫిబ్రవరిలో ఈ ట్యాబ్ ను ఇండియాలో వన్ ప్లస్ లాంచ్ చేసింది. ఇండియాలో ఈ ట్యాబ్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
ఏప్రిల్ 28వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు వన్‍ప్లస్ అధికారిక వెబ్‍సైట్, ఫ్లిప్‍కార్ట్, అమెజాన్ సహా ఆఫ్‍లైన్ స్టోర్లలో ఈ మొబైల్ లభించనుంది.
ముఖ్యంగా ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో వన్ ప్లస్ ప్యాడ్ ను కొనుగోలు చేస్తే దాదాపుగా రూ.2వేల వరకు డిస్కౌంట్ లభించనుంది.
Details
ఫ్రారంభ ధర రూ.37,999
8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ ఉండే ప్రారంభ వేరియంట్ ధర రూ.37,999గా ఉండగా.. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్న మోడల్ ధరను రూ.39,999గా వన్‍ప్లస్ నిర్ణయించింది. ఈ ట్యాబ్ కు నాలుగు స్పికర్లు ఉన్నాయి.
ఈ మొబైల్ కి వెనుక కెమెరా 13 మెగా పిక్సెల్ కాగా ఫ్రంట్ కెమెరా 8 మెగా పిక్సెల్ ఉంది. 67వాట్ల SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‍కు ఇది సపోర్ట్ చేస్తుంది.
ఈ మొబైల్ లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ డిస్‍ప్లే ఉండడం ప్రత్యేకత. అదే విధంగా 500 నిట్స్ వరకు పీక్ బ్రైట్‍నెస్ ఉంటుంది.
9,150mAh బ్యాటరీ ఈ వన్‍ప్లస్ ప్యాడ్‍లో ఉంటుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వన్ ప్లస్ ప్యాడ్ ట్యాబ్ ధర
No bad angles.
— OnePlus India (@OnePlus_IN) April 18, 2023
The all-new #OnePlusPad, coming soon!
Know more: https://t.co/ZxN176gxgH pic.twitter.com/HgWST3nuxy