Page Loader
వార్తలను తెలుసుకోవడానికి వాట్సప్‌లో సరికొత్త ఫీచర్!
వాట్సాప్ కొత్త ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది

వార్తలను తెలుసుకోవడానికి వాట్సప్‌లో సరికొత్త ఫీచర్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 25, 2023
12:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచంలో అత్యధిక యూజర్లను వాట్సప్ సొంతం చేసుకుంది. ఈ మధ్య వరుస అప్‌డేట్‌ను అందిస్తూ యూజర్లకు మరింత దగ్గర అవుతోంది. మెటా యాజమాన్యంలోని ఈ కంపెనీ తాజాగా ఛానల్స్ అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీంతో న్యూస్ అప్‌డేట్స్ ను యూజర్లు వేగంగా తెలుసుకొనే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం ఆండ్రాయిడ్ డివైజ్‌లకు ప్రత్యేకంగా లాంచ్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే iOS 23.8.0.75కి సంబంధించిన కొత్త వాట్సాప్‌ బీటాలో ఈ ఫీచర్‌ కనిపించింది. వాట్సప్ ఫీచర్లను ఎప్పటికప్పుడు అందించే WaBetaInfo నివేదిక ప్రకారం వాట్సప్ కంపెనీ, యాప్ లోని స్టేటస్ ట్యాబ్ ని అప్డే‌ట్స్ గా మార్చి 'ఛానల్స్' అనే కొత్త ఫీచర్ను‌ యాడ్ చేయాలని భావిస్తోంది.

Details

నచ్చిన ఛానల్ ఫాలో అయ్యే అవకాశం

వాట్సప్ ఛానెల్ ఫీచర్ కు, టెలిగ్రామ్ ఛానెల్ ఫీచర్ కు చాలా దగ్గరి పొలికలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇంతకుముందు టెలిగ్రామ్ నుంచి యానిమేటెడ్ ఎమోజీ ఫీచర్ ను కూడా వాట్సప్ కాపీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఛానల్ లో జాయిన్ అయ్యే వారి ఫోన్ నంబర్స్ ఇందులో కనపడవు. ఇందులో మనకి నచ్చిన ఛానల్ ని ఫాలో అయ్యే అవకాశం ఉండనుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే ఈ ఫీచర్ పై వాట్సప్ చాలా కాలంగా పనిచేస్తోందట. కాబట్టి ఈ ఫీచర్ భవిష్యతులో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. గతేడాది వాట్సప్ ఫోటోలు, వీడియోలు కోసం 'View Once' ఫీచర్ను తీసుకొచ్చింది.