Page Loader
త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్‌లు సేవ్ చేసే ఫీచర్

త్వరలో వాట్సాప్ లో disappearing మెసేజ్‌లు సేవ్ చేసే ఫీచర్

వ్రాసిన వారు Nishkala Sathivada
Apr 05, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్disappearing మెసేజ్‌ల విభాగంలో పంపిన సందేశాలను సేవ్ చేసే ఫీచర్ వినియోగదారులకు అందుబాటులో రానుంది. అయితే, ఈ ఫీచర్ ప్రస్తుతం బీటా ఛానెల్‌లోని iOS వినియోగదారులకు మాత్రమే యాక్సెస్ ఉంది. ప్రస్తుతం, వాట్సాప్ లో disappearing మెసేజ్‌ల కోసం మూడు టైమర్‌లు ఉన్నాయి 24 గంటలు, 7 రోజులు లేదా 90 రోజులు. ఆ తర్వాత, యాప్ ఆ సందేశాలను క్లియర్ చేస్తుంది. సందేశాన్ని ఉంచడానికి, సంబంధిత టెక్స్ట్ బబుల్‌పై ఎక్కువసేపు నొక్కాలి. అప్పుడు "keep" అనే ఆప్షన్ వస్తుంది. kept మెసేజ్‌లు సెక్షన్ నుండి స్టోర్ అయిన మెసేజ్‌లను యాక్సెస్ చేయచ్చు. సందేశాన్ని అలాగే ఉంచకూడదనుకుంటే, "unkeep" అనే ఆప్షన్ ఉంటుంది. అప్పుడు మెసేజ్ ఎంచుకున్న వ్యవధి తర్వాత అదృశ్యమవుతుంది.

వాట్సాప్

ఇదే ఫీచర్ ఆండ్రాయిడ్ బీటాలో కూడా అందుబాటులో ఉంది

అయితే, "unkeep"ని ఎంచుకున్న తర్వాత, "keep" ఆప్షన్ ను మళ్లీ ఉపయోగించలేరు. ఈ ఫీచర్ iOS బీటా అప్‌డేట్ 23.7.0.72లో ఉంది. ఇదే విధమైన ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులకు అలాగే 2.23.8.3 అప్‌డేట్ క్రింద అందుబాటులో వస్తుంది. అదృశ్యమయ్యే సందేశాల కోసం వాట్సాప్ కొత్త వ్యవధిని కూడా అభివృద్ధి చేస్తోంది. కొత్త అప్‌డేట్ 1 సంవత్సరం, 180 రోజులు, 60 రోజులు, 30 రోజులు, 21 రోజులు, 14 రోజులు, ఆరు రోజులు, రెండు రోజులు, ఒక గంట వరకు అనే ఆప్షన్స్ అందిస్తుంది. వాట్సాప్ "లాక్ చాట్" ఫీచర్‌పై కూడా పనిచేస్తోంది. కొత్త ఆప్షన్‌తో, చాట్‌లు, మీడియాను ప్రైవేట్‌గా ఉంచుకోవచ్చు.