iPhone 17e: ₹64,900కే iPhone 17e లాంచ్.. 48MP కెమెరాతో అదిరే ఫీచర్లు
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ తన ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా కొత్తగా iPhone 17e ను భారత్‌లో విడుదల చేసింది. ప్రారంభ ధర రూ.64,900గా నిర్ణయించారు.ఐఫోన్ 17 ఫ్యామిలీలో అత్యంత తక్కువ ధరలో లభించే మోడల్ ఇదే. గతంలో వచ్చిన iPhone 16eతో పోలిస్తే ఈ కొత్త ఫోన్‌లో పలు కీలక అప్‌గ్రేడ్స్ ఇచ్చారు. ముఖ్యంగా కొత్త A19 చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, మెరుగైన బలమైన డిజైన్, MagSafe సపోర్ట్, అలాగే 256GB నుంచి ప్రారంభమయ్యే డబుల్ స్టోరేజ్ అందుబాటులో ఉంచారు. పనితీరులో భారీ పెరుగుదల కనిపించనుంది. కొత్త A19 చిప్, iPhone 11తో పోలిస్తే రెండు రెట్లు వేగంగా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది.
వివరాలు
కొత్త C1X మోడెమ్‌తో పెరుగనున్న ఇంటర్నెట్ స్పీడ్
6-కోర్ CPU, 4-కోర్ GPUతో గేమింగ్ గ్రాఫిక్స్ మరింత మెరుగ్గా ఉండనుంది. హార్డ్‌వేర్ ఆధారిత రే ట్రేసింగ్ సపోర్ట్ కూడా ఉంది. కొత్త C1X మోడెమ్‌తో ఇంటర్నెట్ స్పీడ్ పెరగడంతో పాటు పవర్ వినియోగం తగ్గిందని తెలిపింది. కెమెరా విషయానికి వస్తే, 48MP ఫ్యూజన్ ప్రైమరీ కెమెరా "ఆప్టికల్ క్వాలిటీ" 2x జూమ్ అందిస్తుంది. ముందు భాగంలో 12MP ట్రూడెప్త్ కెమెరా సెల్ఫీల కోసం ఉంది. 4K వీడియోలను Dolby Visionతో 60fps వరకు రికార్డ్ చేయవచ్చు. 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లే, గరిష్టంగా 1200 నిట్స్ HDR బ్రైట్నెస్‌తో వస్తోంది.
వివరాలు
మార్చి 4 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం
స్క్రాచ్‌లు తగ్గించేందుకు Ceramic Shield 2 రక్షణ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ పరంగా చూస్తే, Qi2, MagSafe వైర్‌లెస్ ఛార్జింగ్‌కు 15W వరకు సపోర్ట్ ఉంది. USB-C ద్వారా వైర్డ్ ఛార్జింగ్ చేస్తే అరగంటలో 50శాతం వరకు చార్జ్ అవుతుందని కంపెనీ చెబుతోంది. A19 చిప్,కొత్త మోడెమ్ కారణంగా రోజంతా బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందని హామీ ఇచ్చింది. ఈ ఫోన్ iOS 26పై పనిచేస్తుంది.కొత్తగా మార్చిన ఇంటర్‌ఫేస్‌తో పాటు Apple Intelligence ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. మెసేజెస్,FaceTime,ఫోన్ కాల్స్‌లో లైవ్ ట్రాన్స్‌లేషన్, కాల్ స్క్రీనింగ్,హోల్డ్ అసిస్ట్,మెసేజ్ ఫిల్టరింగ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. మార్చి 4 నుంచి ప్రీ-ఆర్డర్లు ప్రారంభం కానుండగా, 256GB వెర్షన్ ధర రూ.64,900, 512GB మోడల్ ధర రూ.84,900గా నిర్ణయించారు.