Loading...
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లీక్స్.. కొత్త రంగులపై అభిమానుల అసంతృప్తి!
ఐఫోన్ 18 ప్రో లీక్స్.. కొత్త రంగులపై అభిమానుల అసంతృప్తి!

iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో లీక్స్.. కొత్త రంగులపై అభిమానుల అసంతృప్తి!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2026
11:29 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ త్వరలో విడుదల చేయనున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన పలు లీక్స్ ప్రస్తుతం టెక్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారాయి. సెప్టెంబరులో అధికారికంగా ఆవిష్కరించనున్న ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ డిజైన్,బరువు,రంగులు వంటి అంశాలపై వెలువడుతున్న సమాచారం కొంతమంది వినియోగదారులను నిరాశకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఫోన్ మందం పెరగడం, బరువు ఎక్కువ కావడం, బ్లాక్ కలర్ అందుబాటులో ఉండకపోవచ్చనే ప్రచారం ఆసక్తిని రేకెత్తిస్తోంది. లీకైన వివరాల ప్రకారం ఐఫోన్ 18 ప్రో,ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు ప్రస్తుత ఐఫోన్ 17ప్రో సిరీస్‌తో పోలిస్తే దాదాపు 2 మిల్లీమీటర్ల వరకు మందంగా ఉండే అవకాశం ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ల సమాచారం ప్రకారం ఈ ఫోన్ల మొత్తం మందం 10.75మిల్లీమీటర్ల వరకు చేరవచ్చని తెలుస్తోంది.

వివరాలు 

బరువులోనూ మార్పు కనిపించే అవకాశం

అయితే కొన్ని నివేదికలు మాత్రం ఈ పెరుగుదల ప్రధానంగా వెనుక భాగంలోని కెమెరా బంప్ పరిమాణం కారణంగానే కనిపిస్తుందని పేర్కొంటున్నాయి.

ఫోన్ అసలు బాడీ మందం సుమారు 8.75 మిల్లీమీటర్లుగా ఉండొచ్చని ఆ నివేదికలు చెబుతున్నాయి.

కొత్త ప్రో మ్యాక్స్ మోడల్ బరువులోనూ మార్పు కనిపించే అవకాశం ఉందని లీక్స్ సూచిస్తున్నాయి.

ఈ ఫోన్ బరువు దాదాపు 240గ్రాములకు చేరవచ్చని అంచనా. ప్రస్తుతం ఉన్న ఐఫోన్ 17ప్రో మ్యాక్స్ బరువు 233 గ్రాములు కాగా, కొత్త మోడల్ దానికంటే ఏడు గ్రాములు ఎక్కువగా ఉండొచ్చని సమాచారం.

ఇప్పటికే ప్రో మ్యాక్స్ ఫోన్లు చేతిలో ఎక్కువ బరువుగా అనిపిస్తాయనే అభిప్రాయాలు ఉండగా, తాజా మోడల్ మరింత బరువు పెరగవచ్చనే వార్తలు వినియోగదారుల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.

వివరాలు 

బ్లాక్ కలర్ వేరియంట్‌ను ఆపిల్ నిలిపివేయొచ్చనే ప్రచారం

ఇక రంగుల విషయానికొస్తే,ఐఫోన్ ప్రో సిరీస్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన బ్లాక్ కలర్ వేరియంట్‌ను ఆపిల్ ఈసారి నిలిపివేయొచ్చనే ప్రచారం జరుగుతోంది.

దానికి బదులుగా డార్క్ చెర్రీ,లైట్ బ్లూ, సిల్వర్ రంగుల్లో మాత్రమే ఐఫోన్ 18 ప్రో సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురావచ్చని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

ఈ సమాచారం నిజమైతే బ్లాక్ కలర్ ఐఫోన్‌ను ఇష్టపడే వినియోగదారులకు ఇది నిరాశ కలిగించే అంశంగా మారే అవకాశం ఉంది.

అయితే ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఈ వివరాలన్నీ లీక్స్, అనధికారిక నివేదికల ఆధారంగానే ఉన్నాయి.

ఐఫోన్ 18 ప్రో సిరీస్‌కు సంబంధించిన అసలు డిజైన్, రంగులు, స్పెసిఫికేషన్లపై స్పష్టత రావాలంటే యాపిల్ అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందేనని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.

ADVERTISEMENT