Loading...
iPhone Duo: వాడకం ఎలా ఉన్నా...మడతపెడితే ఈ ఐఫోన్లు పగిలిపోతున్నాయ్
వాడకం ఎలా ఉన్నా...మడతపెడితే ఈ ఐఫోన్లు పగిలిపోతున్నాయ్

iPhone Duo: వాడకం ఎలా ఉన్నా...మడతపెడితే ఈ ఐఫోన్లు పగిలిపోతున్నాయ్

వ్రాసిన వారు Balachander Sharma
Oct 26, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ iPhone Duo మార్కెట్లోకి వచ్చిన కొద్ది రోజులకే దాని మన్నికపై సందేహాలు మొదలయ్యాయి. ఫోన్ అందుకున్న కొన్ని గంటల్లోనే లోపలి స్క్రీన్‌పై పగుళ్లు కనిపించాయని కొందరు వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా ఫోన్‌ను మడిచే చోట, హింజ్‌కు సమీపంలో డిస్‌ప్లే దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. ఒక వినియోగదారుడి వాదన ప్రకారం, ఫోన్‌ను 20 సార్లు కూడా తెరిచి మడవకముందే స్క్రీన్‌లో సమస్య కనిపించింది. అయితే, ఈ ఘటనల వెనుక అసలు కారణం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

Details

ఆరు గంటల్లోనే స్క్రీన్‌కు నష్టం?

అక్టోబర్ 23, 2026న చైనా, ఆస్ట్రేలియా వంటి మార్కెట్లలో iPhone Duo అమ్మకాలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఫిర్యాదులు వెలుగులోకి వచ్చాయి.

రెడ్డిట్‌లో Midnight_Slump అనే వినియోగదారు తన అనుభవాన్ని పంచుకున్నారు.

ఫోన్‌ను సుమారు ఆరు గంటలపాటు ఉపయోగించిన తర్వాత స్క్రీన్ మధ్య భాగంలో ఏదో విరిగినట్లు అనిపించిందని, ఫోన్ తెరిచేటప్పుడు పగిలిన శబ్దం కూడా వినిపించిందని పేర్కొన్నారు.

అనంతరం ఆపిల్‌ స్టోర్‌ను సంప్రదించగా, తన ఫోన్‌ను మార్చి ఇచ్చినట్లు తెలిపారు.

మరో రెడ్డిట్ వినియోగదారు Bitter_Offer7123 చైనా ఆన్‌లైన్ కమ్యూనిటీల్లో కనిపించిన ఫొటోలను షేర్ చేశారు.

వాటిలోనూ ఫోన్ మడతకు సమీపంలో ఇలాంటి నష్టం కనిపించినట్లు సమాచారం.

Details

డిజైన్ లోపమా.. అరుదైన సమస్యా?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఐఫోన్ డిజైన్‌లో లోపం ఉందని నిర్ధారించలేం. ఎన్ని ఫోన్లలో ఈ సమస్య వచ్చిందనే వివరాలు కూడా లేవు.

మరోవైపు, గతంలో నిర్వహించిన కొన్ని ఫోల్డింగ్ పరీక్షల్లో ఇదే తరహా స్క్రీన్ పగుళ్లు కనిపించలేదని నివేదికలు పేర్కొన్నాయి.

పదేపదే మడిచినప్పుడు అరుగుదల కనిపించినప్పటికీ, పరీక్షల సమయంలో స్క్రీన్ విరిగినట్లు నివేదించలేదు.

ప్రభావిత వినియోగదారుల్లో కొందరికి యాపిల్ ఫోన్లను మార్చి ఇచ్చినట్లు సమాచారం. దెబ్బతిన్న పరికరాలను పరిశీలించి కారణాన్ని గుర్తించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అధికారిక వివరణ వచ్చే వరకు ఈ ఘటనలను మొత్తం iPhone Duo మోడల్‌కు సంబంధించిన లోపంగా చూడటం తొందరపాటు అవుతుంది.

ADVERTISEMENT