
భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగాలు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి మీద చంద్రయాన్-3 సురక్షితంగా దిగిన తర్వాత భారతదేశ వ్యాప్తంగా సంబరాలు ఆకాశాన్ని అంటాయి. చంద్రయాన్-3 ప్రాజెక్టులో భాగమైన ప్రతీ ఒక్కరికీ సోషల్ మీడియా వేదికగా అభినందనలు కురిపించారు.
చంద్రయాన్-3 పూర్తి కావడంతో భవిష్యత్తులో ఇస్రో చేపట్టనున్న ఇతర ప్రాజెక్టులు ఏంటనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. ప్రస్తుతం ఇస్రో చేపట్టనున్న ఇతర అంతరిక్ష యాత్రలు ఏంటో చూద్దాం.
గగన్ యాన్:
అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపే ప్రాజెక్ట్ ఇది. అంతరిక్షంలోకి మానవులను ఇస్రో సొంతంగా ఇప్పటివరకూ పంపించలేదు. 1984లో రాకేష్ శర్మ అంతరిక్షంలోకి అడుగుపెట్టినా ఆ ప్రాజెక్టులో సోవియట్ యూనియన్ రష్యా భాగస్వామ్యం కూడా ఉంది.
గగన్ యాన్ ప్రాజెక్టును 2024లో ఇస్రో చేపట్టనుంది.
Details
సూర్యుడిపై పరిశోధనలకు ఇస్రో సిద్ధం
ఆదిత్య ఎల్-1:
సూర్యుడిపై పరిశోధనలు చేసేందుకు ఆదిత్య ఎల్-1 ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది. భూమి నుండి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి సూర్యుడు వ్యవస్థలోని లాంగ్రేజీ పాయింట్ వద్దకు అంతరిక్ష వ్యోమనౌకను పంపించడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం.
శుక్రయాన్:
శుక్రగ్రహానికి, భూమికీ కొన్ని పోలికలున్నాయి. కాబట్టి శుక్రగ్రహం పైకి వ్యోమనౌకను పంపించి అక్కడి వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేసే ఉద్దేశ్యంతో శుక్రయాన్ ప్రాజెక్టును ఇస్రో చేపట్టనుంది.
Details
అంగారక గ్రహంపై..
అంతేకాదు, అంగారక గ్రహం పైకి ఇప్పటికే ఆర్బిటార్ ను పంపిన ఇండియా, ఈసారి అంగారక గ్రహం మీద ల్యాండింగ్ చేయాలని భావిస్తోంది.
ఈ విషయమై అనేక చర్చలు జరుగుతున్నాయి. మరి అంగారక గ్రహం మీద ల్యాండింగ్ మాడ్యూల్ పంపిస్తారా లేదా అనేది చూడాలి.
నిసార్ భూమిపై జరిగే విపత్తులను ఎదుర్కోవడానికి కావాల్సిన సమాచారాన్ని అందజేసే ఉపగ్రహాన్ని నాసాతో కలిసి అంతరిక్షంలోకి ఇస్రో పంపించనుంది.
ఈ ఉపగ్రహం భూమిని పరిశీలిస్తూ, భూమి మీద జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటుంది.