Isro: ఇస్రో మరో మైలురాయి: ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని చేరుకుంది. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (SSLV) మూడవ దశ (SS3)ను విజయవంతంగా పరీక్షించింది. ఈ ప్రయోగాన్ని మంగళవారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (SDSC)లోని సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్ సెంటర్‌లో నిర్వహించారు. ఇస్రో ప్రకారం, ఈ పరీక్ష ద్వారా మూడు-దశల ఆల్-సాలిడ్ లాంచ్ వెహికల్ (SSLV) పనితీరును విశ్లేషించడమే కాక, అవసరమైన డేటా సేకరించినట్లు ఇస్రో వెల్లడించింది ఈ వెహికల్ చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలో వేగంగా పంపేందుకు రూపొందించబడింది. అంతేకాక, ఇది అధిక స్థాయిలో ఉత్పత్తికి అనుకూలంగా ఉందని అధికారులు తెలిపారు.
వివరాలు
అధిక వేగంతో పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపడంలో SS3 కీలకం
అధిక వేగంతో పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపడంలో SS3 కీలకంగా పని చేస్తుందని వెల్లడించారు. ఇస్రో తెలిపిన వివరాల ప్రకారం, ఈ వెహికల్ సుమారు 90 కిలోల వరకు పేలోడ్ సామర్థ్యాన్ని అందించగలదు. ప్రస్తుతం చేసిన అప్‌గ్రేడ్లు మెరుగైన ఇగ్నైటర్, నాజిల్ డిజైన్, ఉపగ్రహాల సామర్థ్యం,నిర్మాణాత్మక దృఢత్వాన్ని పెంచాయని అధికారులు వెల్లడించారు. పరీక్షలో ఒత్తిడి, థ్రస్ట్, ఉష్ణోగ్రత, వైబ్రేషన్, యాక్యుయేటర్ పనితీరు వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎస్‌ఎస్‌ఎల్వీ మూడో స్టేజ్ పరీక్ష విజయవంతం
STORY | ISRO conducts ground test of SSLV third stage at Sriharikota
— Press Trust of India (@PTI_News) December 31, 2025
ISRO has carried out a successful static test of an improved version of the third stage of SSLV at the Solid Motor Static Test Facility of Satish Dhawan Space Centre, Sriharikota in Andhra Pradesh.
READ:… pic.twitter.com/3RvxTC6hbt