English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / Gaganyan: మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌'కు క్య్రూ మాడ్యూల్‌ సిద్ధం
    తదుపరి వార్తా కథనం
    Gaganyan: మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌'కు క్య్రూ మాడ్యూల్‌ సిద్ధం
    మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌'కు క్య్రూ మాడ్యూల్‌ సిద్ధం

    Gaganyan: మానవ రహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌'కు క్య్రూ మాడ్యూల్‌ సిద్ధం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    11:50 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇస్రో తొలిసారిగా చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌కు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి.

    వచ్చే రెండేళ్లలో రోదసిలో వ్యోమగాములను పంపించి, వారిని సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ మిషన్‌ ప్రారంభమవుతోంది.

    ఈ దిశగా ఫిబ్రవరిలో మొదటి మానవరహిత ప్రయోగం సన్నద్ధమవుతోంది. హ్యూమన్‌ రేటెడ్‌ లాంచ్‌ వెహికల్‌ మార్క్‌-3 (హెచ్‌ఎల్‌వీఎం3)-జీ1 ద్వారా ఇస్రో రూపొందించిన ఆర్బిటల్‌ మాడ్యూల్‌ను అంతరిక్షంలోకి పంపించనున్నారు.

    ఈ మాడ్యూల్‌ను బుధవారం ప్రత్యేక వాహనంలో షార్‌కు చేరవేశారు.

    వివరాలు 

    8,200 కిలోల బరువైన ఆర్బిటల్‌ మాడ్యూల్‌

    హెచ్‌ఎల్‌వీఎం3-జీ1 రాకెట్‌ ద్వారా 8,200 కిలోల బరువైన ఆర్బిటల్‌ మాడ్యూల్‌ను 170 కిలోమీటర్ల ఎత్తులోకి పంపి, 430 కిలోమీటర్ల దూరంలో దీర్ఘవృత్తాకార కక్ష్యలో, లోయర్‌ ఎర్త్‌ అర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.

    7 రోజులు తరువాత, ఈ మాడ్యూల్‌ను సురక్షితంగా భూమిపైకి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నారు.

    ఈ ప్రక్రియలో ఏదైనా అపరిశీలిత పరిస్థితి సంభవించినా, వ్యోమగాములు సురక్షితంగా బయటపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్ధారించేందుకు ఈ మానవ రహిత ప్రయోగం కీలకంగా ఉపయోగపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో

    తాజా

    Vikram Misri: కాల్పుల విరమణను పాక్ తుంగలో తొక్కింది.. విక్రమ్ మిస్రీ ఆగ్రహం భారతదేశం
    India Pak Conflict: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ కాల్పుల మోత? ఒమర్ అబ్దుల్లా
    Airspace: భారత్-పాక్ కాల్పుల విరమణతో పాక్ గగనతలానికి గ్రీన్ సిగ్నల్ పాకిస్థాన్
    Cease Fire Violation: రెచ్చిపోయిన పాక్.. భారత్‌పై మళ్లీ దాడులు భారతదేశం

    ఇస్రో

    ISRO: ఇస్రో కొత్తగా ప్రయోగించిన ఉపగ్రహం EOS-08 ఏం చేస్తుంది? టెక్నాలజీ
    ISRO: ఇస్రో 2019-2023 మధ్య 64 అమెరికా ఉపగ్రహాలను ప్రయోగించింది టెక్నాలజీ
    Nasa-Isro: నాసా-ఇస్రో సంయుక్త మిషన్ యాక్సియమ్-4 ప్రయోగం ఆలస్యం.. కారణం ఏంటంటే..? నాసా
    Isro SSLV Rocket : నేడు SSLV రాకెట్‌ను ప్రయోగించనున్న ఇస్రో  టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025