NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? 
    తదుపరి వార్తా కథనం
    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? 
    చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు

    ఇస్రో: చంద్రయాన్ 3 మోసుకెళ్తున్న పరికరాలు ఏంటి? వాటి ఉపయోగాలు ఏంటి? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 11, 2023
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రుడి మీదకు మూడవ మిషన్ చంద్రయాన్-3 ని పంపించడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చాలా ఉత్సాహంగా ఉంది. జులై 14వ తేదీన చంద్రయాన్-3 మిషన్ లాంచ్ కానుంది.

    చంద్రయాన్-3 అనేది చంద్రుడి దక్షిణ ధృవం పరిశోధించడానికి పనిచేస్తుంది. ఈ ప్రదేశంలో ఎక్కువ భాగం చీకటిగా ఉంటుంది. అయితే చంద్రయాన్-3 మిషన్ మోసుకెళ్లే పరికరాలు ఏంటో తెలుసుకుందాం.

    చంద్రయాన్-3లో ప్రొపుల్సన్ మాడ్యూల్, ల్యాండర్ మాడ్యూల్, 26కిలోల రోవర్ ఉంటుంది. మొత్తం కలిపి 3900కిలోల బరువు ఉంటుంది.

    ఆర్బిటార్ ని ఈ మిషన్ మోసుకెళ్ళడం లేదు. ఇంకా కమ్యూనికేషన్ రిలే సాటిలైట్ గా ప్రొపుల్సన్ మాడ్యూల్ పనిచేస్తుంది. బ్యాకప్ కోసం చంద్రయాన్-2 ఆర్బిటార్ ని ఉపయోగిస్తుంది.

    Details

    ల్యాండర్ లో ఉండే పరికరాలు 

    చంద్రుడి కక్ష్యలోకి 100కిలోమీటర్ల వరకు ల్యాండర్ ని రవాణా చేసే బాధ్యత ప్రొపుల్సన్ మాడ్యూల్ మీద ఉంటుంది. చంద్రుడి దక్షిణ ధృవాన్ని చేరుకునే సమయంలో ప్రొపుల్సన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోతుంది.

    చంద్రుడి మీద దిగగానే చంద్రుడి ఉపరితలం మీద పరిశోధనలు చేయడానికి రోవర్ పనిచేస్తుంది. ల్యాండర్, రోవర్ లో అనేక పరికరాలు ఉన్నాయి.

    1752కిలోల ల్యాండర్ లో చంద్రుడి ఉష్ణోగ్రతను కొలిచే పరికరం, చంద్రుడి కంపనాలను కొలిచే సాధనం కూడా ఉంటుంది. ల్యాండర్ లో మొత్తం నాలుగు పరికరాలు ఉంతాయి. ఒక్కో పరికరం ఒక్కో పనిచేస్తుంది.

    Details

    చంద్రుడి ఉపరితలాన్ని పరిశోధించే ప్రొపుల్సన్ మాడ్యూల్ 

    రోవర్ లో రెండు లోడ్స్ ఉంటాయి. వాటిలో ఒకటి ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోమీటర్ (APXS), ఇది ల్యాండింగ్ సైట్‌లోని రాళ్ళను పరిశోధించి, చంద్రుడి ఉపరితలంలో ఏమేం ఉన్నాయో గుర్తిస్తుంది.

    లేజర్ ఇండస్ బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ అనేది మరో పరికరం ద్వారా చంద్రుడి ఉపరితలం మీద ఉండే రసాయనాలను పరిశోధిస్తుంది. చంద్రయాన్-3 లోని ప్రొపుల్సన్ మాడ్యూల్ కూడా పరిశోధనలు చేస్తుంది.

    చంద్రయాన్-3 మిషన్ ని జులై 14 శుక్రవారం మద్యాహ్నం 2:35నిమిషాలకు ఎల్ వీ ఎమ్ 3 రాకెట్ ద్వారా లాంచ్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇస్రో

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    ఇస్రో

    అరుదైన తోకచుక్క చిత్రాలను తీసిన చంద్ర టెలిస్కోప్ భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఉత్తరాఖండ్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ నాసా
    భారతదేశ వ్యోమగామి శిక్షణా కార్యక్రమానికి సహకరించనున్న IIT మద్రాస్-ఇస్రో భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025