LOADING...
Xiaomi 17: 50MP క్వాడ్ కెమెరా, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో వచ్చేసింది
50MP క్వాడ్ కెమెరా, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో వచ్చేసింది

Xiaomi 17: 50MP క్వాడ్ కెమెరా, 7000mAh బ్యాటరీ, OLED డిస్‌ప్లేతో వచ్చేసింది

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

షియోమీ తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ షియోమీ 17 (Xiaomi 17)ను చైనాలో విడుదల చేసింది. ఈ ఫోన్‌లో అత్యాధునిక ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉన్నాయి. డిస్‌ప్లే 6.3 అంగుళాల 1.5K OLED ఫ్లాట్ M10 LTPO ప్యానెల్, 1-120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. ముఖ్య ఫీచర్‌గా 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఇది కొత్త "రెడ్ లైట్ ఎమిటింగ్ మెటీరియల్"తో రూపొందించారు. షియోమీ డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ డిస్‌ప్లేను రక్షిస్తుంది.

Details

పర్ఫార్మెన్స్

ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. గరిష్టంగా 16GB LPDDR5X RAM అందుబాటులో ఉంది. గేమింగ్ సమయంలో వేడెక్కకుండా ఉండేందుకు రింగ్ ఆకారపు కూలింగ్ సిస్టమ్ కూడా ఉండనుంది. కెమెరా లీకా సుమ్మిలక్స్ లెన్స్‌తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 50MP 2.6X టెలిఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీ కెమెరా కూడా 50MPకి అప్‌గ్రేడ్ చేశారు. బ్యాటరీ, ఛార్జింగ్ 7000mAh సామర్థ్యంతో ఉంది. 100W షియోమీ సర్జ్ వైర్డ్ ఛార్జింగ్, 50W షియోమీ సర్జ్ వైర్‌లెస్ ఛార్జింగ్, అలాగే 22.5W వైర్డ్ మరియు వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కి సపోర్ట్ అందిస్తుంది.

Details

 ధరలు ఎలా ఉన్నాయంటే?

12GB + 256GB మోడల్: 4499 యువాన్ (సుమారు రూ.55,880) 12GB + 512GB మోడల్: 4799 యువాన్ (సుమారు రూ.59,700) 16GB + 512GB మోడల్: 4999 యువాన్ (సుమారు రూ.62,185) షియోమీ 17 ఇప్పుడు చైనాలో అమ్మకానికి అందుబాటులో ఉంది.