LOADING...
Rare Auroras: యురేనస్‌పై అరుదైన ఆరొరాలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన చిత్రాలు
జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన చిత్రాలు

Rare Auroras: యురేనస్‌పై అరుదైన ఆరొరాలు.. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సంచలన చిత్రాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

నాసా(NASA)కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్(James Webb Space Telescope) తాజాగా సంచలన విషయాన్ని బయటపెట్టింది. సౌర కుటుంబంలో నెప్ట్యూన్‌ కంటే చాలా దూరంలో ఉన్న ఐస్ జెయింట్ గ్రహం యురేనస్ (Uranus)పై అరుదైన ఆరొరాలు కనిపించాయని వెల్లడించింది. ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఊహాగానాలకే పరిమితమైన ఈ వెలుగుల రహస్యం ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. ఇన్‌ఫ్రారెడ్ పరిశీలనల ద్వారా యురేనస్‌ వాతావరణంలో భారీగా విస్తరించిన ప్రకాశవంతమైన కాంతి పట్టీలు, చారలు నమోదయ్యాయి. ఇవి భూమిపై కనిపించే ఉత్తర, దక్షిణ ధృవ కాంతుల్లాంటివే కానీ పరిమాణంలో చాలా పెద్దవి, తీవ్రతలో మరింత శక్తివంతమైనవి అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

వివరాలు 

అయస్కాంత క్షేత్రం ఉన్న ఇతర గ్రహాలపైనా ఇలాంటి ఆరొరాలు

యురేనస్‌ అయస్కాంత క్షేత్రం దాని భ్రమణ అక్షానికి సుమారు 60 డిగ్రీల కోణంలో వంగి ఉండటం, అలాగే కేంద్రం నుంచి దూరంగా ఉండటం వల్ల సూర్యుడి నుంచి వచ్చే ఛార్జ్ కణాలు అసమానంగా తాకుతున్నాయి. ఈ ప్రత్యేక పరిస్థితుల్లోనే ఆరొరాలు ఏర్పడుతున్నాయని గుర్తించారు. పలుమార్లు చేసిన పరిశీలనల్లో ఈ కాంతులు కదులుతూ, మారుతూ గ్రహం పైభాగంలో విస్తరిస్తున్నట్టు నమోదు చేశారు. దీంతో యురేనస్‌ అయస్కాంత శక్తి, వాతావరణ గమనాలపై కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపైనే కాదు, అయస్కాంత క్షేత్రం ఉన్న ఇతర గ్రహాలపైనా ఇలాంటి ఆరొరాలు సంభవిస్తాయని ఈ అధ్యయనం మరోసారి స్పష్టం చేసింది.

Advertisement