NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / టెక్నాలజీ వార్తలు / చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ఉంటుందని మీకు తెలుసా? దాని విశేషాలివే 
    తదుపరి వార్తా కథనం
    చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ఉంటుందని మీకు తెలుసా? దాని విశేషాలివే 
    జపాన్ తో కలిసి చంద్రయాన్-4 ప్రయోగాన్ని చేపట్టనున్న ఇస్రో

    చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ఉంటుందని మీకు తెలుసా? దాని విశేషాలివే 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 25, 2023
    06:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంతో ఇప్పుడంతా చంద్రయాన్-4 మీదకు టాపిక్ మళ్ళింది. ఇస్రో చేపట్టనున్న భవిష్యత్తు ప్రాజెక్టుల్లో చంద్రయాన్-4 కూడా ఉంది.

    చంద్రుడి మీద అన్వేషణ సాగించే ఈ ప్రయోగాన్ని ఇస్రో సొంతంగా కాకుండా జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లోరేషన్ ఏజెన్సీ(JAXA) భాగస్వామ్యంతో జరపనుంది.

    ఈ ప్రయోగం ముఖ్య లక్ష్యం చంద్రుడి మీద నీటి జాడలు కనిపెట్టడం.

    చంద్రుడి మీద శాశ్వత నీడలో ఉన్న ప్రదేశాలైన ధృవాల వద్ద నీటి జాడలను కనిపెట్టడం, వాటి క్వాలిటీని కనుక్కోవడం. గతంలో చేసిన అన్వేషణల ఫలితంగా చంద్రుడి మీద నీటి జాడలు ఉండవచ్చని కనుక్కున్నారు.

    ఇప్పుడు నిర్దిష్టమైన సాక్ష్యాలతో నీటి జాడలను కనుక్కోవాలని భావిస్తున్నారు.

    Details

    2026లో చంద్రయాన్-4 లాంచ్?

    చంద్రయాన్-4 ప్రయోగంలో ల్యాండర్, రోవర్ ఉండనున్నాయి. ఈ ప్రయోగంలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించనున్నారట.

    విద్యుత్ సరఫరా కోసం అధునాతన సోలార్ ప్యానెల్స్, పవర్ సప్లై కోసం హై ఎనర్జీ బ్యాటరీస్ ఉండేలా చూస్తారట.

    చంద్రుడి మీద అన్వేషణలు చేయడంలో మరింత వేగంగా ఉండే టెక్నాలజీ, చంద్రుడి ఉపరితలంపై తవ్వకాలు జరిపేలా చేసే సాంకేతికత, చంద్రుడి మీద ఎక్కువరోజులు పనిచేసేలా ఉండడానికి కావాల్సిన టెక్నాలజీని రూపొందించనున్నారట.

    చంద్రయాన్-4 ప్రయోగం 2026సంవత్సరంలో జపాన్ కు చెందిన H3 రాకెట్ ద్వారా లాంచ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రయోగంలో నీటి జాడలు కనుక్కోగలిగితే భవిష్యత్తులో మానవ సహిత చంద్రమండల యాత్రలు చేయవచ్చని ఇస్రో భావిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చంద్రయాన్-3
    ఇస్రో

    తాజా

    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్
    Kannappa : భీమవరంలో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. జూన్ 22న గ్రాండ్‌గా! మంచు విష్ణు

    చంద్రయాన్-3

    చందమామ దిశగా దూసుకెళ్తున్న చంద్రయాన్-3, ఆగస్ట్ 23న జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్  ఇస్రో
    Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్  ఇస్రో
    చంద్రయాన్-3 కక్ష్య కుదింపు చర్యలు పూర్తి చేసిన ఇస్రో: ఇక మిగిలింది అదొక్కటే  ఇస్రో
    చంద్రయాన్-3: ప్రొపుల్షన్ మాడ్యూల్ నుండి ల్యాండర్ విడిపోవడం; కీలక దశ జరిగేది ఈరోజే  ఇస్రో

    ఇస్రో

    చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు; చంద్రుడికి మరింత చేరువలో వ్యోమనౌక బెంగళూరు
    PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం  శ్రీహరికోట
    చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్  చంద్రయాన్-3
    Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్ -3; ఈ నెల 23న జాబిల్లిపై మిషన్ ల్యాండింగ్  చంద్రయాన్-3
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025