Lava Blaze Duo 5G : డ్యూయల్ డిస్‌ప్లేతో లావా బ్లేజ్ డ్యూయో 5జీ.. ఫీచర్స్ సూపర్బ్!
లావా కంపెనీ తాజాగా లావా బ్లేజ్ డ్యూయో 5జీ అనే డ్యూయల్ డిస్‌ప్లే స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ వెనుక భాగంలో ప్రత్యేకంగా సెకండరీ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించింది. దీనిని 'ఇన్స్టాస్క్రీన్' అని పిలుస్తున్నారు. ఈ ఏడాది లావా అగ్ని 3 5జీ లాంచ్ తర్వాత లావా నుంచి వచ్చిన రెండవ డ్యూయల్ డిస్‌ప్లే ఫోన్ ఇది. లావా బ్లేజ్ డ్యూయో 5జీ సెలెస్టియల్ బ్లూ, ఆర్కిటిక్ వైట్ కలర్లలో అందుబాటులో ఉంటుంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 16,999, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 17,999 గా నిర్ణయించారు.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో రూ.2వేల వరకూ డిస్కౌంట్
ఈ ఫోన్ డిసెంబర్ 20 నుంచి అమెజాన్ ఇండియాలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.2వేల వరకూ డిస్కౌంట్ పొందవచ్చు. వెనుక భాగంలో '1.58 అంగుళాల' సెకండరీ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ఎస్ఓసీ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. 6.67 అంగుళాల *ఫుల్ హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేతో మెరుగైన అనుభూతిని అందిస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై నడుస్తుంది, అంతేకాదు భవిష్యత్‌లో ఆండ్రాయిడ్ 15 అప్‌డేట్ కూడా అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది.
ముందు భాగంలో 16 మెగాపిక్సెల్
ముఖ్యంగా 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5000mAh బ్యాటరీ కలిగి ఉంది. వెనుక డ్యూయల్ కెమెరా సెటప్, 64 మెగాపిక్సెల్ సోనీ ప్రైమరీ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా, ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. లావా బ్లేజ్ డ్యూయో 5జీ కొత్త ఫీచర్లతో భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ప్రత్యేకించి డ్యూయల్ డిస్‌ప్లే ప్రేమికులు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఖాయం.