Google's Pixel 11 Pro: లాంచ్‌కు ముందే లీకైన గూగుల్ Pixel 11 Pro Fold.. డిజైన్, ఫీచర్లివే..
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన తదుపరి హార్డ్‌వేర్ ఈవెంట్ నిర్వహించే ముందే, రానున్న Google Pixel 11 Pro Foldకు సంబంధించిన మార్కెటింగ్ రెండర్లు ప్రముఖ టిప్‌స్టర్ Evan Blass ద్వారా ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ రెండర్ల ద్వారా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ డిజైన్‌తో పాటు కొన్ని ముఖ్యమైన మార్పులు కూడా బయటపడ్డాయి. లీకైన చిత్రాల ప్రకారం, Pixel 11 Pro Fold రూపకల్పన గత తరం మోడల్‌ను చాలా వరకు పోలి ఉంటుంది. పొడవైన కవర్ డిస్‌ప్లే, లోపల 8 అంగుళాల పెద్ద ఫోల్డబుల్ స్క్రీన్‌ను కొనసాగించనుంది. Pixel 11 Pro కోసం గూగుల్ ఇప్పటికే టీజ్ చేసిన ప్రత్యేకమైన గ్లోయింగ్ లైట్ ఫీచర్‌ను కూడా ఈ ఫోల్డ్ మోడల్‌లో అందించనున్నట్లు సమాచారం.
వివరాలు
కొత్త ఆలివ్ గ్రీన్ కలర్ ఆకర్షణ..
Pixel 11 Pro Foldలో కొత్తగా ఆలివ్ గ్రీన్ కలర్ వేరియంట్‌ను గూగుల్ తీసుకురానున్నట్లు లీక్ వెల్లడించింది.
ఈ కొత్త రంగు ఫోన్‌కు మరింత ప్రీమియం లుక్‌ను అందిస్తుందని తెలుస్తోంది.
ఇక లోపలి ఫోల్డబుల్ డిస్‌ప్లే పరిమాణం మాత్రం గత మోడల్‌లాగే 8 అంగుళాలుగానే కొనసాగనుంది.
ఇటీవల తమ ఫోల్డబుల్ ఫోన్లలో చిన్న పరిమాణం డిజైన్‌ను ఎంచుకున్న శాంసంగ్ , యాపిల్ కు భిన్నంగా, గూగుల్ మాత్రం పెద్ద ఇన్నర్ డిస్‌ప్లేను కొనసాగిస్తున్నట్లు సమాచారం.
వివరాలు
ఆగస్టు 12న అధికారికంగా ఆవిష్కరణ..
లీక్ ప్రకారం, పిక్సెల్ 11 ప్రో పోర్డ్ గత మోడల్‌తో పోలిస్తే మరింత సన్నగా ఉండనుంది.
ఫోన్ మడిచినప్పుడు దాని మందం 10.1 మిల్లీమీటర్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది.
గత మోడల్‌లో ఈ మందం 10.8 మిల్లీమీటర్లు ఉండేది. గూగుల్ నిర్వహించనున్న తదుపరి హార్డ్‌వేర్ ఈవెంట్‌లో ఆగస్టు 12న సాయంత్రం 6 గంటలకు (ET) ఈ స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమంలో పిక్సెల్ 11 Pro Foldతో పాటు కొత్త పిక్సెల్ బడ్స్, కొత్త పిక్సెల్ వాచ్ ను కూడా గూగుల్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.