Loading...
Logitech: క్రేజీ కంపెనీ.. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు 7 వేల మంది ఉద్యోగులకు పెయిడ్ లీవ్!
క్రేజీ కంపెనీ.. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు 7 వేల మంది ఉద్యోగులకు పెయిడ్ లీవ్!

Logitech: క్రేజీ కంపెనీ.. వీడియో గేమ్స్ ఆడుకునేందుకు 7 వేల మంది ఉద్యోగులకు పెయిడ్ లీవ్!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 12, 2026
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ రంగంలో ప్రముఖ సంస్థ లాజిటెక్ తన ఉద్యోగుల కోసం వినూత్న నిర్ణయం తీసుకుంది. వీడియో గేమ్స్ ఆడటం వల్ల సమయం వృథా అవుతుందనే అభిప్రాయాన్ని మార్చే ప్రయత్నం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సంస్థకు చెందిన సుమారు 7వేల మంది ఉద్యోగులకు ఏడాదిలో ఒక రోజు ప్రత్యేకంగా పెయిడ్ లీవ్ ప్రకటించింది. ఈ సెలవు రోజున ఉద్యోగులు ఆఫీస్ పనులకు దూరంగా ఉండి,తమకు ఇష్టమైన వీడియో గేమ్స్ ఆడుకోవచ్చని తెలిపింది. వచ్చే ఏడాది గ్రాండ్ తెఫ్ట్ ఆటో 6 (GTA VI)విడుదల కానున్న నేపథ్యంలో లాజిటెక్ ఈ నిర్ణయం తీసుకుంది. గేమ్ విడుదల సమయంలో ఉద్యోగులు సెలవులు పెట్టకుండా ఉండేందుకు 'లాగి గేమ్ డే' పేరుతో ఈ ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టింది.

వివరాలు 

వచ్చే ఏడాది నవంబర్‌లోగా తమకు నచ్చిన ఏ రోజైనా ఈ ప్రత్యేక సెలవు వినియోగం 

ఫుల్‌టైమ్ ఉద్యోగులతో పాటు ఇంటర్న్‌లకు కూడా ఈ అవకాశం కల్పించింది.

ఈ సెలవును కేవలం జీటీఏ 6 విడుదల రోజునే తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

వచ్చే ఏడాది నవంబర్‌లోగా తమకు నచ్చిన ఏ రోజైనా ఈ ప్రత్యేక సెలవును వినియోగించుకోవచ్చని వెల్లడించింది.

వీడియో గేమ్స్ ఆడటం సమయం వృథా చేయడం కాదని లాజిటెక్ సీఈఓ హన్నెకే ఫాబర్ పేర్కొన్నారు.

గేమింగ్ వల్ల ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసం పెరగడంతో పాటు పనితీరు కూడా మెరుగుపడుతుందని అభిప్రాయపడ్డారు.

సరైన విశ్రాంతి,ఆటలతో కూడిన విరామం ఉద్యోగులకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని సంస్థ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఎలైన్ లైర్డ్ తెలిపారు.

ఇలాంటి విరామం తర్వాత ఉద్యోగులు మరింత ఉత్సాహంగా,సరికొత్త ఆలోచనలతో విధులకు హాజరవుతారని చెప్పారు.

వివరాలు 

లాజిటెక్ అధికారికంగానే గేమింగ్ డే సెలవు

నవంబర్ 19న లాజిటెక్ కార్యాలయంలో నిర్వహించే గేమింగ్ కార్యక్రమంలో సీఈఓ హన్నెకే ఫాబర్ స్వయంగా పాల్గొననున్నారు.

మరోవైపు జీటీఏ 6 విడుదల సమయంలో అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగులు సెలవులు తీసుకునే అవకాశం ఉందని కొన్ని అంచనాలు వెలువడ్డాయి.

దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు ఆ రోజు విధులకు దూరంగా ఉండవచ్చని, దీనివల్ల బిలియన్ డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించవచ్చని అంచనా వేశారు.

చాలామంది గేమర్లు తమకు ఇష్టమైన గేమ్స్ ఆడేందుకు సాధారణ సెలవులు అడగకుండా అనారోగ్య కారణాలు చూపిస్తూ సిక్ లీవ్ తీసుకుంటున్నట్లు కొన్ని సర్వేలు వెల్లడించాయి.

ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని లాజిటెక్ అధికారికంగానే గేమింగ్ డే సెలవును ప్రకటించడం టెక్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.

ADVERTISEMENT

వివరాలు 

కంపెనీ ఈ నిర్ణయం కార్పొరేట్ రంగంలో కొత్త చర్చకు తెరలేపింది

లాజిటెక్ నిర్ణయం బాటలోనే అమెరికాలోని కొన్ని సైనిక విభాగాలు కూడా తమ సైనికులకు ప్రత్యేక సెలవులు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగులు, సిబ్బంది వ్యక్తిగత ఆసక్తులు, మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యం ఇస్తూ లాజిటెక్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ రంగంలో కొత్త చర్చకు తెరలేపింది.

ఉద్యోగుల అభిరుచులను గౌరవించే ఇలాంటి విధానాలు భవిష్యత్తులో మరిన్ని సంస్థల్లో అమలయ్యే అవకాశాలున్నాయి.

ADVERTISEMENT