Loading...
Apple MacBook Neo: మ్యాక్‌బుక్ నియోపై భారీ తగ్గింపు.. రూ.69,700కే సొంతం చేసుకునే ఛాన్స్!
మ్యాక్‌బుక్ నియోపై భారీ తగ్గింపు.. రూ.69,700కే సొంతం చేసుకునే ఛాన్స్!

Apple MacBook Neo: మ్యాక్‌బుక్ నియోపై భారీ తగ్గింపు.. రూ.69,700కే సొంతం చేసుకునే ఛాన్స్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 17, 2026
04:41 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ నియో ప్రస్తుతం భారత్‌లో రికార్డు స్థాయి తగ్గింపు ధరతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. రిలయన్స్ డిజిటల్ అందిస్తున్న ప్రత్యేక ఆఫర్లతో ఈ ల్యాప్‌టాప్‌ను మరింత తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం వినియోగదారులకు లభిస్తోంది. వాస్తవానికి ఈ ల్యాప్‌టాప్ గరిష్ఠ చిల్లర ధర(MRP)రూ.79,900 కాగా, రిలయన్స్ డిజిటల్‌లో ప్రస్తుతం రూ.76,700 ప్రత్యేక ధరకు విక్రయిస్తున్నారు. అంతేకాకుండా అర్హత కలిగిన ICICI బ్యాంక్, SBI బ్యాంక్ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో చెల్లింపు చేస్తే వెంటనే రూ.7,000 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మ్యాక్‌బుక్ నియోను కేవలంరూ.69,700కే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఒక్కసారిగా మొత్తం చెల్లించలేని వినియోగదారుల కోసం రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఈఎంఐ సదుపాయాలను కూడా అందిస్తోంది.

వివరాలు 

మ్యాక్‌బుక్ నియో ప్రత్యేకతలు

ఎంపిక చేసిన బ్యాంకుల ద్వారా ఆరు నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ అందుబాటులో ఉండగా, ఎక్కువ కాల వ్యవధికి తక్కువ వడ్డీతో ఈఎంఐ ఎంపికలు కూడా ఉన్నాయి.

అయితే బ్యాంకు, చెల్లింపు విధానాన్ని బట్టి ఈ ఆఫర్లు మారే అవకాశం ఉంది.

మ్యాక్‌బుక్ నియోలో 13 అంగుళాల లిక్విడ్ రెటినా డిస్‌ప్లేను అందించారు.

ఇది 2408 × 1506 పిక్సెల్స్ రిజల్యూషన్, గరిష్ఠంగా 500 నిట్స్ బ్రైట్‌నెస్ను అందిస్తుంది.

ఈ ల్యాప్‌టాప్‌కు యాపిల్ రూపొందించిన A18 Pro చిప్‌సెట్ శక్తినిస్తోంది. ఇందులో 6-కోర్ CPU, 5-కోర్ GPU ఉన్నాయి.

వివరాలు 

మ్యాక్‌బుక్ నియో ప్రత్యేకతలు

స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 8GB ర్యామ్,256GB SSD స్టోరేజ్ లభిస్తుంది.

macOS ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ల్యాప్‌టాప్‌లో మ్యాజిక్ కీబోర్డ్,1080p ఫేస్‌టైమ్ కెమెరా, డ్యూయల్ స్పీకర్లు,బ్లూటూత్ 6,3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్,రెండు USB-C పోర్టులు ఉన్నాయి.

బ్యాటరీ పరంగా ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్ఠంగా 16గంటల వీడియో స్ట్రీమింగ్,11 గంటల వరకు వైర్‌లెస్ వెబ్ బ్రౌజింగ్ చేయవచ్చని ఆపిల్ తెలిపింది.

బాక్స్‌లో 20WUSB-C పవర్ అడాప్టర్,1.5 మీటర్ల USB-C ఛార్జింగ్ కేబుల్ కూడా లభిస్తాయి.

ప్రస్తుతం అందిస్తున్న ఈ ప్రత్యేక ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి.

స్టాక్ లభ్యత,భాగస్వామ్య బ్యాంకుల ఆఫర్లను బట్టి ధరలు లేదా డిస్కౌంట్లు మారే అవకాశం ఉందని రిలయన్స్ డిజిటల్ వెల్లడించింది.

ADVERTISEMENT