Loading...
Mark Zuckerberg: ఐర్లాండ్‌లో చారిత్రక కోటను కొనుగోలు చేసిన మెటా సీఈవో జుకర్‌బర్గ్
ఐర్లాండ్‌లో చారిత్రక కోటను కొనుగోలు చేసిన మెటా సీఈవో జుకర్‌బర్గ్

Mark Zuckerberg: ఐర్లాండ్‌లో చారిత్రక కోటను కొనుగోలు చేసిన మెటా సీఈవో జుకర్‌బర్గ్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్‌ ఐర్లాండ్‌లోని చారిత్రక గోతిక్‌ శైలిలో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్‌ను కొనుగోలు చేశారు. ఈ ఆస్తిని కొన్ని వారాల క్రితమే జుకర్‌బర్గ్ దంపతులు కొనుగోలు చేసినట్లు 'ది ఐరిష్ టైమ్స్' వెల్లడించింది. అయితే ఈ కోటను ఎంత మొత్తానికి కొనుగోలు చేశారనే విషయం అధికారికంగా వెల్లడికాలేదు. 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న కోటతో పాటు 440 ఎకరాల ఎస్టేట్‌కు సుమారు 2 కోట్ల నుంచి 3 కోట్ల యూరోలు చెల్లించి ఉండొచ్చని అంచనా. జుకర్‌బర్గ్ కుటుంబం ఈ చారిత్రక భవనాన్ని జాగ్రత్తగా చూసుకుంటుందని, ఐర్లాండ్‌కు ప్రయాణించే సమయంలో అక్కడికి వస్తారని ఆయన ప్రతినిధి బ్రియాన్ బేకర్ తెలిపారు.

వివరాలు 

1830లో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్..  

ఐర్లాండ్‌లో మెటా సంస్థకు అంతర్జాతీయ ప్రధాన కార్యాలయం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.

అయితే జుకర్‌బర్గ్ దంపతులు ఈ ఆస్తిని నిర్వహించినప్పటికీ, తమ నివాసాన్ని మాత్రం అమెరికాలోనే కొనసాగించనున్నట్లు 'ది ఐరిష్ టైమ్స్' తెలిపింది.

స్ట్రాంకల్లీ క్యాసిల్‌ను సుమారు 1830లో అప్పటి టోరీ ఎంపీ కోసం నిర్మించారు.

గతంలో ఈ ఎస్టేట్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు మైఖేల్ అలెన్-బక్లీ, ఆయన భార్య జియాంకార్లా సొంతం. వారు 2000ల ప్రారంభంలో ఈ ఆస్తిని కొనుగోలు చేసి, దాదాపు రెండు దశాబ్దాల పాటు పునరుద్ధరణ పనులు చేపట్టారు.

ఇప్పుడు ఈ చారిత్రక ఎస్టేట్ యజమానుల జాబితాలో జుకర్‌బర్గ్ కూడా చేరారు.

వివరాలు 

జుకర్‌బర్గ్‌ భారీ ఆస్తుల జాబితాలో మరో చారిత్రక భవనం

గతంలో జేమ్స్ డైసన్, స్ట్రైప్ సహ వ్యవస్థాపకుడు జాన్ కొలిసన్ వంటి ప్రముఖులు కూడా ఐర్లాండ్‌లోని చారిత్రక ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టారు.

జుకర్‌బర్గ్‌కు భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నాయి.

కాలిఫోర్నియాలోని పాలో ఆల్టోలోనే ఆయనకు 11కు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.

వీటితో పాటు ఫ్లోరిడా, వాషింగ్టన్ డీసీ, హవాయిలోనూ ఆయనకు ఆస్తులు ఉన్నాయి.

తాజాగా స్ట్రాంకల్లీ క్యాసిల్ కొనుగోలుతో ఆయన ఆస్తుల జాబితాలో మరో ప్రత్యేకమైన చారిత్రక భవనం చేరింది.

ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకత కలిగిన, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఆస్తులపై జుకర్‌బర్గ్‌కు ఉన్న ఆసక్తి మరోసారి ఈ కొనుగోలుతో స్పష్టమైంది.

ADVERTISEMENT