Loading...
Mark Zuckerberg: యూఎఫ్‌సీ ఫైటర్‌తో మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్.. సరస్సులోకి ఎత్తి విసిరేసిన ఫైటర్
సరస్సులోకి ఎత్తి విసిరేసిన ఫైటర్

Mark Zuckerberg: యూఎఫ్‌సీ ఫైటర్‌తో మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్.. సరస్సులోకి ఎత్తి విసిరేసిన ఫైటర్

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 14, 2026
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

మెటా సీఈఓ మార్క్ జూకర్‌బర్గ్‌కు మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది. తాజాగా కాలిఫోర్నియా సమీపంలోని తాహో సరస్సులో ఆయన యూఎఫ్‌సీ ఫైటర్‌తో కలిసి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో పాల్గొన్నారు. ఇందుకోసం సరస్సుపై తేలియాడే రింగ్‌ను ఏర్పాటు చేసి ఇద్దరూ ఫైట్ చేశారు. ఈ ట్రైనింగ్ సెషన్‌లో జుకర్‌బర్గ్, యూఎఫ్‌సీ ఫైటర్ పరస్పరం కిక్‌లు, పంచ్‌లు విసురుకున్నారు. ఇద్దరూ పోటాపోటీగా తలపడుతున్న సమయంలో ఫైటర్ జుకర్‌బర్గ్‌ను ఒక్కసారిగా పైకెత్తి సరస్సులోకి విసిరేశారు. అయితే జుకర్‌బర్గ్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఫైటర్‌ను గట్టిగానే ఎదుర్కొన్నారు.

వివరాలు 

ఫైట్‌కు సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన జుకర్‌బర్గ్

ఈ ఫైట్‌కు సంబంధించిన వీడియోను మార్క్ జుకర్‌బర్గ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'మళ్లీ తిరిగొచ్చా.. రౌండ్ టు' అంటూ ఆయన దీనికి క్యాప్షన్ ఇచ్చారు.

జుకర్‌బర్గ్‌కు మార్షల్ ఆర్ట్స్‌పై ఉన్న ఆసక్తి నేపథ్యంలో ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యూఎఫ్‌సీ ఫైటర్‌తో మార్క్ జుకర్‌బర్గ్ ఫైటింగ్

ADVERTISEMENT