LOADING...
Meta AI smart glasses: కేవలం రూ.25 వేలకే మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు సవాల్!
కేవలం రూ.25 వేలకే మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు సవాల్!

Meta AI smart glasses: కేవలం రూ.25 వేలకే మెటా ఏఐ స్మార్ట్ గ్లాసెస్.. గూగుల్, యాపిల్‌కు సవాల్!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 24, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

వేరబుల్స్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు టెక్ దిగ్గజం మెటా కొత్త అడుగు వేసింది. గూగుల్,స్నాప్ వంటి సంస్థలకు పోటీగా 299 డాలర్ల (సుమారు రూ.25 వేలు)ప్రారంభ ధరతో సొంత బ్రాండ్‌పై ఏఐ ఆధారిత స్మార్ట్ గ్లాసెస్‌ను విడుదల చేసింది. ఎస్సిలార్ లూక్సోటికా భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ సరికొత్త గ్లాసెస్‌ను జూన్ 23న మెటా అధికారికంగా ప్రకటించింది. ఇప్పటి వరకు రేబాన్,ఓక్లీ వంటి ప్రముఖ బ్రాండ్లతో కలిసి స్మార్ట్ గ్లాసెస్‌ను అందించిన మెటా..ఈసారి ప్రత్యేక డిజైనర్ బ్రాండింగ్ లేకుండానే తక్కువ ధరలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రేబాన్ మెటా గ్లాసెస్ ధర 379 డాలర్లు కాగా,కొత్త మోడళ్ల ధర దాదాపు 80డాలర్లు తక్కువగా ఉండటం విశేషం.

వివరాలు 

మూడు ఫ్రేమ్‌లలో కొత్త మోడళ్లు

కొత్త స్మార్ట్ గ్లాసెస్ శ్రేణిలో వివిధ రంగులు, డిజైన్లతో పాటు మూడు ప్రధాన ఫ్రేమ్ ఎంపికలను మెటా పరిచయం చేసింది. బేసిక్ వేరియంట్లైన 'అడ్వెంచరర్', 'ఫ్యూరీ' మోడళ్లు 299 డాలర్లకే అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ కైలీ జెన్నర్‌తో కలిసి రూపొందించిన ప్రీమియం ఎడిషన్ 'స్టార్‌ఫైర్' మోడల్ ధరను 399 డాలర్లుగా నిర్ణయించింది.

వివరాలు 

ఆకట్టుకునే ఫీచర్లు

ఈ కొత్త ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌లో 12 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు ఓపెన్-ఈర్ స్పీకర్లు అందించారు. మెటా ఏఐ సపోర్ట్‌తో చేతులు ఉపయోగించకుండా వాయిస్ కమాండ్ల ద్వారా ప్రశ్నలు అడిగి సమాధానాలు పొందే సదుపాయం ఉంది. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్‌ఫారమ్‌లకు నేరుగా లైవ్ స్ట్రీమింగ్ చేయవచ్చు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. అలాగే ప్రిస్క్రిప్షన్ లెన్స్‌లను కూడా ఈ గ్లాసెస్‌లో ఉపయోగించుకునే అవకాశం కల్పించారు. రేబాన్ విజయంతో కొత్త వ్యూహం 2023 నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 70 లక్షలకు పైగా రేబాన్ మెటా గ్లాసెస్ విక్రయాలు నమోదయ్యాయి. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని మరింత తక్కువ ధరలో కొత్త వేరియంట్లను మార్కెట్లోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

వివరాలు 

స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో పెరుగుతున్న పోటీ 

మెటా తాజా లాంచ్‌తో స్మార్ట్ గ్లాసెస్ రంగంలో పోటీ మరింత తీవ్రమైంది. గూగుల్ సంస్థ శాంసంగ్, వార్బీ పార్కర్ భాగస్వామ్యంతో 2026 చివర్లో తన ఏఐ గ్లాసెస్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మరోవైపు స్నాప్ కంపెనీ అధునాతన ఏఆర్ స్పెక్టకల్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఇక యాపిల్ కూడా రాబోయే సంవత్సరాల్లో ఈ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే వేరబుల్స్ రంగంలో సరికొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడమే తమ ప్రధాన లక్ష్యమని మెటా సీఈవో Mark Zuckerberg తెలిపారు.

Advertisement

వివరాలు 

ప్రైవసీపై మెటా వివరణ

కొత్త మెటా స్మార్ట్ గ్లాసెస్ ప్రస్తుతం కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో వివిధ రంగులలో అందుబాటులోకి వచ్చాయి. అయితే బిల్ట్-ఇన్ కెమెరా కారణంగా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉందంటూ కొందరు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మెటా.. ఈ గ్లాసెస్‌లో ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ లేదని స్పష్టం చేసింది. అలాగే కెమెరా పనిచేస్తున్న సమయంలో ఇతరులకు తెలిసేలా ప్రత్యేక ఇండికేటర్ లైట్ వెలుగుతుందని, భద్రతా ప్రమాణాలను పూర్తిగా పాటించామని పేర్కొంది.

Advertisement