
Meta smart glasses: మెటా కొత్త స్మార్ట్ గ్లాసెస్ ధర $800 ఉండొచ్చు..
ఈ వార్తాకథనం ఏంటి
మెటా తన తదుపరి తరం స్మార్ట్ గ్లాసెస్‌ను ఈ ఏడాది చివర్లోనే మార్కెట్‌లోకి తీసుకురానుందని సమాచారం. "హైపర్‌నోవా" అనే కోడ్ నేమ్‌తో వస్తున్న ఈ గ్లాసెస్ ధరను కంపెనీ సుమారు $800 వరకు తగ్గించిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చెబుతోంది. కొత్త ఉత్పత్తులపై తక్కువ లాభాలను అంగీకరించి, ఎక్కువమంది వినియోగదారులను ఆకర్షించాలన్న వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
మార్కెట్ విధానం
ఐఫోన్‌తో పోటీగా ధర
మొదట మెటా ఈ హైపర్‌నోవా గ్లాసెస్‌ను $1,000కి అమ్మాలని ప్లాన్ చేసింది. కానీ కొత్త ధరతో చూసుకుంటే, ఈ గ్లాసెస్‌ను యాపిల్ ఐఫోన్ 16, 17 వంటి స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా మార్కెట్‌లో నిలబెట్టాలని కంపెనీ ఉద్దేశం. ఫోన్‌లకు బదులుగా వాడుకునే తదుపరి తరం పర్సనల్ కంప్యూటింగ్ డివైస్‌గా ఈ గ్లాసెస్‌ను పరిచయం చేయాలన్న ఆలోచన మెటాకు ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రోడక్ట్ వివరాలు
హైపర్‌నోవా స్మార్ట్ గ్లాసెస్ ఫీచర్లు
హైపర్‌నోవా స్మార్ట్ గ్లాసెస్‌లో కుడి లెన్స్ దిగువ భాగంలో మోనోక్యులర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇతర కంపెనీల గ్లాసెస్‌లా రెండు డిస్‌ప్లేల సిస్టమ్ కాకుండా, ఇది కేవలం కుడి కంటిముందే సమాచారం చూపిస్తుంది. ముఖ్యంగా కిందికి చూసినప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. క్వాల్కమ్ చిప్‌సెట్‌తో నడిచే ఈ గ్లాసెస్‌లో ఫోటోలు తీయడం, వీడియోలు చూడడం, మ్యాప్స్ ఓపెన్ చేయడం, నోటిఫికేషన్‌లు చెక్ చేయడం వంటి యాప్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
టెక్ స్పెక్స్
నియంత్రణ కోసం న్యూరల్ రిస్ట్‌బ్యాండ్
కంట్రోల్ సౌలభ్యం కోసం మెటా ఈ గ్లాసెస్‌తో పాటు న్యూరల్ రిస్ట్‌బ్యాండ్నూ అందించనుంది. దీని ద్వారా చేతి కదలికలు, రిస్ట్ జెష్చర్‌లతో గ్లాసెస్‌ని ఆపరేట్ చేయవచ్చు. ఇవి ఆండ్రాయిడ్ మోడిఫైడ్ వెర్షన్‌పై నడుస్తాయి. అయితే వీటికి ప్రత్యేక యాప్ స్టోర్ ఉండకపోవచ్చని సమాచారం. ఫ్రేమ్ సైడ్‌పై ట్యాప్, స్వైప్ లాంటి టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి.
లాంచ్ టైం లైన్
ఏఐ ఇంటిగ్రేషన్ ప్రభావం
హైపర్‌నోవా స్మార్ట్ గ్లాసెస్‌ను వచ్చే నెలలోనే విడుదల చేసే అవకాశం ఉంది. గూగుల్ జెమిని వేర్‌బుల్ ప్లాట్‌ఫామ్‌తో పోలిస్తే మెటా తన గ్లాసెస్‌లో ఏఐ సదుపాయాన్ని ఎలా వినియోగిస్తుందో చూడాలి. ఈ ఉత్పత్తి విజయవంతమైతే, స్మార్ట్‌ఫోన్‌లను భవిష్యత్తులో గ్లాసెస్ రీప్లేస్ చేసే అవకాశాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.